News February 7, 2025
కుంభమేళాలో హరీశ్ రావు దంపతులు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. పుణ్య స్నానం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మహా కుంభమేళాకు రావడం సంతోషంగా ఉందన్నారు. మహా గంగా స్నానం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 25, 2026
అన్ని కాలేజీల్లో ఇక ఫేషియల్ రికగ్నిషన్ హాజరు

AP: కాలేజీకి రాకుండానే హాజరును మేనేజ్ చేద్దామనుకుంటే ఇక కుదరదు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు, లెక్చరర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేయాలని GOVT నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌తో పాటు ప్రైవేటు కాలేజీలకూ వచ్చే ఏడాది నుంచి ఇది వర్తించనుంది. రియల్ టైమ్ పర్యవేక్షణతో హాజరు శాతాన్ని పెంచడం ద్వారా ప్రమాణాలు మెరుగుపర్చనుంది. 75% హాజరుంటేనే విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతుంది.
News March 25, 2026
మెంటాడ మళ్లీ గజపతినగరంలో కలిసేనా?

నియోజకవర్గాల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో మెంటాడ ప్రజలు తమ మండలాన్ని సాలూరు నుంచి వేరు చేయాలని కోరుతున్నారు. సాలూరు మన్యం జిల్లాలో ఉండగా.. మెంటాడ విజయనగరంలో కొనసాగుతుండడంతో పరిపాలన, అభివృద్ధి పరంగా వెనుక పడుతున్నామని స్థానికుల అభిప్రాయం. ఈ సమస్యను పలుమార్లు అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం తాజా నిర్ణయంతో మెంటాడను మళ్లీ గజపతినగరంలో కలపాలని వారు కోరుతున్నారు.
News March 25, 2026
రాహుల్ పర్యటన రద్దు.. కేరళంకు రేవంత్

కడుపు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్ గాంధీ అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన కేరళం టూర్ రద్దయింది. రాహుల్‌కు బదులుగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు TG CM రేవంత్ కేరళంకు బయల్దేరారు.


