News February 7, 2025
వనపర్తి: స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి చెందిన ఘనట హయత్‌నగర్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవాదిపల్లి వాసి నర్సింహ పెద్దఅంబర్‌పేటలో ఉంటున్నారు. ఆయన కుమార్తె రిత్విక హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాప బస్సు కింద పడి నలిగిపోయిందని వాపోయారు.
Similar News
News January 11, 2026
తిరుపతి: ఇక్కడ మగవాళ్లే పూజలు చేస్తారు..!

తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో ఆదివారం పొంగళ్లు పెట్టారు. ఇక్కడి శ్రీసంజీవరాయ స్వామికి మగవారే పొంగళ్లు పెట్టి పూజలు చేయడం ఇక్కడి అనవాయితీ. ఆలయంలో ఆడవారికి ప్రవేశం లేదు. ఏటా సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం ఈ పొంగళ్లు పెడతారు. దేశ విదేశాల్లో ఉన్న మగవాళ్లు సైతం ఇక్కడికి వచ్చి పొంగళ్లు పెట్టడం విశేషం.
News January 11, 2026
మేడారంపై తలో మాట.. ఇంతకీ పనుల శాతమెంత!

మేడారం పనులపై ఎవరికీ వాళ్లు ఇంత శాతం పనులు అయ్యాయంటూ ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్నారు. మొన్న మంత్రి పొంగులేటి ప్రెస్‌మీట్‌లో 95 శాతమన్నారు. నిన్న సీతక్క ఇంకా పనులు కావాలన్నారు. కలెక్టర్ 80 శాతం పనులు అయ్యాయన్నారు. ఒక పక్క డెడ్ లైన్లు తరచూ మారుస్తున్నారు. మొన్న పొంగులేటి 12 వరకు అనగా, తాజాగా సీఎం వచ్చే వరకు పూర్తి చేస్తామని సీతక్క వెల్లడించారు. పనులు ఎంత మేర జరిగాయో వారికే క్లారిటీ లేకుండా పోయింది.
News January 11, 2026
11x12x20: మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేసే మ్యాజిక్ ఫార్ములా

ఎంత డబ్బు సంపాదించినా దాన్ని సరిగా ఇన్వెస్ట్ చేసే తెలివి ఉండాలి. 11x12x20 సింపుల్ ఫార్ములా అందుకు ఒక స్మార్ట్ వే. నెలకు ₹11,000 చొప్పున 12% రిటర్న్స్ ఇచ్చే సాధనాల్లో 20 ఏళ్లు SIP చేయాలి. చివరకు కాంపౌండింగ్ మ్యాజిక్‌తో మీ చేతికి ఏకంగా ₹కోటి వస్తాయి. మీరు పెట్టేది కేవలం ₹26.4 లక్షలే అయినా వచ్చే లాభం మాత్రం ₹83.5 లక్షలు. రిటైర్మెంట్ ప్లాన్ లేదా పిల్లల చదువుల కోసం ఇది బెస్ట్ ఆప్షన్.


