News February 7, 2025
సమ్మక్క-సారలమ్మ గద్దెలపై హుండీలు ఏర్పాటు

మేడారం చిన్న జాతర ఈనెల 12 నుంచి 15 వరకు జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సమ్మక్క-సారలమ్మ ఆలయాల్లో ఎండోమెంట్ అధికారులు హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దెపై 14 హుండీలు, సారలమ్మ గద్దెపై 14 హుండీలు, పగిడిద్దరాజు గద్దెపై 2 హుండీలు, గోవిందరాజుల గద్దెపై 2 హుండీలు మొత్తం 32 హుండీలను ఏర్పాటు చేశారు. ఈవో రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతి, పరకాల డివిజన్ ఇన్‌స్పెక్టర్ కవిత, అర్చకులు పాల్గొన్నారు.
Similar News
News April 2, 2026
ప్రత్యేక ధరలు, సబ్సిడీలు ఇవ్వాలని ఎంపీ కావ్య డిమాండ్

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం లోక్‌సభలో ఎంపీ మాట్లాడుతూ.. మార్కెట్ ఆధారిత ధరల విధానంతో రైతులపై అదనపు భారం పడుతోందని, సాగు ఖర్చులు పెరిగి రైతుల ఆదాయాలు దెబ్బతింటున్నాయన్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యక్ష ఉపశమనం కల్పించే విధంగా ప్రత్యేక ధరలు లేదా సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.
News April 2, 2026
వరంగల్: ప్రాణదాతలు.. ఈఎంటీలు!

అత్యవసర స్థితిలో ఉన్న బాధితులకు ప్రాథమిక చికిత్స అందిస్తూ, ఆసుపత్రులకు చేర్చి ప్రాణాలు నిలబెడుతున్న 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల సేవలు అమోఘం. ఉమ్మడి వరంగల్‌లో 109 మంది ఈఎంటీలు గడిచిన ఏడాదిలో 1,17,054 మందిని కాపాడారు. జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను సమయస్ఫూర్తితో MGMకు తరలించిన కర్ణాకర్ వంటి వారు ఎందరో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేడు ‘జాతీయ ఈఎంటీ దినోత్సవం’.
News April 2, 2026
వరంగల్: అంగన్‌వాడీ పోస్టులు ఎప్పుడు..?

వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 919 కేంద్రాలు ఉండగా.. 66 టీచర్, 284 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేట ప్రాజెక్టుల పరిధిలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో ఉన్న టీచర్లకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పౌష్ఠికాహారం, సర్వేలు సక్రమంగా జరగడం లేదు.


