News February 7, 2025

జనగామ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

image

తమిళనాడులో ఘనంగా నిర్వహించే అరుణాచల గిరి ప్రదర్శన దర్శనానికి జనగామ డిపో నుంచి ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు జనగామ డిపో మేనేజర్ స్వాతి ప్రకటనలో తెలిపారు. పెద్దలకు రూ.4 వేలు, పిల్లలకు రూ.2,500 టికెట్ ధరలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీన బయలుదేరి 13వ తేదీకి తిరిగి జనగామకు చేరుకుంటుందన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News February 7, 2025

చర్ల: కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని హత్య చేసిన మావోయిస్టులు..!

image

కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని మావోయిస్టులు హత్య చేసిన ఘటన చర్ల మండల సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో జరిగింది. అరన్‌పూర్‌లో జరగనున్న పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా జోగా బోర్సే బరిలో ఉన్నారు. శుక్రవారం మావోయిస్టులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేశారని సమాచారం. దీంతో జోగా బర్సేను హత్య చేసినట్లు తెలుస్తోంది.

News February 7, 2025

రూ.230 కోట్ల డ్రోన్ల కాంట్రాక్టులు రద్దు చేసిన కేంద్రం

image

దేశీయ డ్రోన్ తయారీ సంస్థలకు ఇచ్చిన రూ.230 కోట్ల విలువైన 3 కాంట్రాక్టుల్ని కేంద్రం రద్దు చేసింది. ఆ సంస్థలు చైనా విడిభాగాలతో డ్రోన్లు తయారుచేస్తుండటమే దీనిక్కారణం. వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించేందుకు 400 డ్రోన్లను కొనుగోలు చేయాలని కేంద్రం భావించింది. అందుకోసం ఆ సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చింది. అయితే, వాటిలో వాడే చైనా విడిభాగాల వల్ల జాతీయ భద్రతకు పెనుముప్పు ఉంటుందన్న ఆందోళనతో తాజాగా రద్దు చేసింది.

News February 7, 2025

నేటి నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు 

image

మన్యంకొండ శ్రీ వెంకటేశ్వరా స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొండపై వెలసిన స్వామివారికి నేడు మొదటి రోజు అమ్మవార్ల ఊరేగింపు సేవ, 8న హంస వాహన సేవ, 9న ధ్వజ వాహన సేవ, 10న సూర్యప్రభ వాహన సేవ, 11న హనుమ వాహన సేవ,12న గరుడ వాహన సేవ,13న అశ్వవాహన సేవ,14న దర్బార్ సేవ,15న శేష వాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

error: Content is protected !!