News February 7, 2025
జనసేనకు సూపర్ న్యూస్.. తెలంగాణలోనూ పార్టీకి గుర్తింపు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737454946464_1032-normal-WIFI.webp)
జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో <<15218607>>ప్రాంతీయ పార్టీగా<<>> గుర్తింపు పొందగా తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ SEC ఉత్తర్వులిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2024లో ఏపీలో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రిజిస్టర్డ్ పార్టీ హోదా నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారింది. ఇకపై గాజు గ్లాసు చిహ్నాన్ని ఎవరికీ కేటాయించరు.
Similar News
News February 7, 2025
ఢిల్లీలో హైడ్రామా: కేజ్రీవాల్ ఇంటికి ACB టీమ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738916108101_1199-normal-WIFI.webp)
ఢిల్లీ రాజకీయాలు ముదురు పాకాన పడుతున్నాయి. BJP ఫిర్యాదుపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని LG వీకే సక్సేనా ACBని ఆదేశించారు. నిర్ణీత కాల వ్యవధిలోనే దర్యాప్తును పూర్తి చేయాలని సూచించారు. దీంతో అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పయనమయ్యారు. 16 మంది ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు రూ.15 కోట్ల చొప్పున ఇస్తామంటూ బీజేపీ ఎరవేసిందని నిన్న AK ఆరోపించారు. దీనిని ఖండించిన కమలం పార్టీ ACBకి ఫిర్యాదు చేసింది.
News February 7, 2025
ఇసుక తవ్వకాల కేసు.. తుది నివేదిక సమర్పించాలని సుప్రీం ఆదేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738915479808_653-normal-WIFI.webp)
AP: YCP హయాంలో జరిగిన ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తవ్వకాలన్నీ ఆపేసినట్లు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనానికి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ న్యాయవాది తెలిపారు. అటు గత విచారణ తర్వాత తీసుకున్న చర్యలను ప్రభుత్వం వివరించింది. దీంతో తుది నివేదిక దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గమనించిన అంశాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.
News February 7, 2025
RBI బూస్ట్: తగ్గనున్న EMI భారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738905100560_1199-normal-WIFI.webp)
ఐదేళ్ల తర్వాత RBI రెపోరేటును తగ్గించడంతో రుణగ్రహీతలకు ఊరట లభించనుంది. బెంచ్మార్క్ ఫ్లోటింగ్ రేటు ఆధారంగా హోమ్, ఇతర లోన్లు తీసుకున్న కస్టమర్లకు EMI భారం తగ్గనుంది. కనీసం 25 బేసిస్ పాయింట్ల మేర ఉపశమనం దొరకనుంది. RBI రెపోరేటును తగ్గించినప్పుడు లోన్లపై వడ్డీరేట్లు తగ్గుతాయి. పెరిగితే బ్యాంకులు ఆ మేరకు కస్టమర్లపై భారం వేస్తాయి. తాజా తగ్గింపుతో ఇకపై తీసుకొనే రుణాల భారమూ తగ్గనుంది.