News February 7, 2025

గొల్లప్రోలు: పవన్ చొరవ.. ఆ గ్రామస్థుల కల నెరవేరింది

image

గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేట గ్రామస్థుల కల నెరవేరింది. గొల్లప్రోలు, తాటిపర్తి గ్రామాల నుంచి చిన్న జగ్గంపేట గ్రామానికి వెళ్లే రోడ్డు గోతులమయంగా మారడంతో రాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలు గురయ్యేవారు. ఆ గ్రామస్థులు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేదు. దీంతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో ఆ గ్రామస్థుల ఇబ్బందులు తొలిగాయి.

Similar News

News February 27, 2026

కామారెడ్డి: సంఘటన్ సృజన్ అభియాన్‌తో సంస్థాగత బలోపేతం

image

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘటన్ సృజన్ అభియాన్ 7వ రోజు శిక్షణ శిబిరం విజయవంతంగా జరిగింది. రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ మైనారిటీ విభాగం ఛైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గార్హీ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ స్థాయి నిర్మాణ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ఎన్నికల వ్యూహాలపై మార్గదర్శనం చేశారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, నగేశ్ రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.

News February 27, 2026

HYD: ఆ రోజు ఆలయాలు బంద్!

image

చంద్రగ్రహణం దృష్ట్యా మార్చి 3న కడ్తాల్‌లోని మైసిగండి మైసమ్మ ఆలయంతో పాటు శివాలయ, రామాలయాలు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో స్నేహలత చెప్పారు. మూడో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆలయ శుద్ధి, అభిషేకం, అలంకరణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. గ్రహణం దృష్య్టా నగరంలోని ప్రముఖ ఆలయాలను సైతం మూసివేయనున్నారు.
SHARE IT

News February 27, 2026

వావ్.. వరంగల్ నగరం ఎంత బాగుంది: ఎంపీ కావ్య

image

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 అంతస్తుల భవనం పైనుంచి చూస్తే వరంగల్ నగరం ఎంతో బాగుందని ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నేడు సందర్శించిన సందర్భంగా కలెక్టర్ సత్య శారదతో కలిసి లిఫ్టులో 24 అంతస్తుల ఆస్పత్రి భవనంలోని అన్ని ఫ్లోర్లలో తిరిగారు. చివరన 24 అంతస్తుల పైభాగానికి వెళ్లి నగరాన్ని చూస్తూ సంబరపడ్డారు.