News February 7, 2025
శ్రీకాకుళం: యాచనకు వచ్చి.. మహిళపై దాడి

యాచనకు వచ్చిన ఓ మహిళ గురువారం రాత్రి శ్రీకాకుళం నగరానికి చెందిన గృహిణిపై దాడి చేసింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. సీమనాయుడుపేటకు చెందిన జయలక్ష్మి కుటుంబం సభ్యులు అందరూ బయటకు వెళ్లారు. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్న సమయంలో ఒక మహిళ యాచనకు వచ్చి ఒంటరిగా ఉన్న ఆమెపై దాడి చేసింది. ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకునేందుకు ప్రయత్నించగా జయలక్ష్మి ప్రతిఘటించి కేకలు వేసింది. స్థానికులు రావడంతో ఆ మహిళ పరారైంది.
Similar News
News March 8, 2026
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధమ కర్తవ్యం: ఎమ్మెల్యే శిరీష
లావేరు: ఇసుక రవాణాలో కానరాని నిబంధనలు
శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల పోలీసులు కార్డెన్ సెర్చ్
శ్రీకాకుళం: ఏయూ స్టడీ సెంటర్ కొనసాగిస్తారా ?
ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టండి: ఇచ్ఛాపురం వైసీపీ సమన్వయకర్త
జిల్లాలో పలు చోట్ల పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేత
News March 7, 2026
సివిల్స్ ర్యాంకర్ రామును అభినందించిన అచ్చెన్న

జి. సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 463వ ర్యాంకు సాధించడం పట్ల వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రాము కష్టపడి చదివి ఈరోజు సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కృషి ఉంటే ఎలాంటి పరిస్థితులులోనైనా ఉన్నత స్థాయిలో రాణించవచ్చన్నారు.
News March 7, 2026
శ్రీకాకుళం: కేజీబీవీల్లో ప్రవేశాలకు వేళాయె!

పేద విద్యార్థులకు ప్రమాణాలతో విద్య అందిస్తున్న కేజీబీవీలో 6 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీలు ఉన్నాయి. ఈనెల 12 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. డ్రాప్ అవుట్, అనాధ, సింగిల్ పేరెంట్ బాలికలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


