News February 7, 2025

సూర్యపేట: మహిళ హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

image

మహిళ హత్య కేసులో ఓ వ్యక్తికి NLG జిల్లా 2వ అదనపు కోర్టు జడ్జి రోజారమణి గురువారం జీవిత ఖైదు విధించారు. చివ్వెల(M)కి చెందిన విజయకు కర్నూలు జిల్లాకు చెందిన మూజువర్ నూర్ మహ్మద్‌తో పరిచయమైంది. వారు కొంతకాలం సహజీవనం చేయగా ఆమెకు వేరొకరితో సంబంధం ఉందని అనుమానించిన మహ్మద్ 2014జూన్6న కనగల్(M) పర్వతగిరి వద్ద ఆమెను హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హజరుపర్చగా జడ్జి అతడికి శిక్ష విధించారు.

Similar News

News November 11, 2025

MBNR: ‘అంగన్‌వాడీ పనితీరు మెరుగుపడాలి’

image

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ సీడీపీఓలు, సూపర్ వైజర్‌లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు శాతం పెంచాలని అన్నారు. గ్రామాల్లో కేంద్రాలకు ఎంత మంది హాజరవుతున్నారనే అంశంపై స్పష్టత ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు.

News November 11, 2025

‘తుఫాను బాధితులకు తక్షణమే పరిహారం అందించాలి’

image

తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రజలు, రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున చెప్పారు. మంగళవారం చీరాల ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రైతుల సమస్యలపై వినతి పత్రం అందించారు. తుఫాను వలన రైతులు ఆర్థికంగా నష్టపోయారని వారికి మేలు చేయాలని కోరారు.

News November 11, 2025

ప్చ్.. దేశంలోనే జూబ్లీహిల్స్ లాస్ట్!

image

ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోలింగ్ శాతంలో మన హైదరాబాద్‌ చివరి స్థానంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా 8 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. మిజోరంలోని డంపా 82.34 శాతంతో పోలింగ్‌లో నం.1 స్థానంలో నిలిచింది. మన జూబ్లీహిల్స్ మాత్రం 48.43% ఓటింగ్‌తో చివరి స్థానానికి పడిపోయింది. సెన్సిటివ్ ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోని బడ్గాం నియోజకవర్గంలో మన కంటే 2% ఎక్కువే నమోదైంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఏమో?