News February 7, 2025

విజయవాడ: ఆ ప్రాంతాల్లో 6 రైళ్లు రద్దు

image

విజయవాడ రైల్వే డివిజన్‌లో నాన్ ఇంటర్ ల్యాకింగ్ పనులు నిమిత్తమై పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. RJY-VJA (67261), (67201) VJA-RJY (67262), (67201), KKD పోర్ట్-VJA (17257), VJA-KKD పోర్ట్ (17257) శనివారం రద్దు అవుతాయన్నారు. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు కోరారు. 

Similar News

News March 8, 2026

నెల్లూరు: వారిని జైలు కలిపింది.!

image

ఆ ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు. వీరిలో రామకృష్ణపై 27 కేసులు, మరో నిందితుడు బిట్రగుంటకు చెందిన మాల్యాద్రిపై14 కేసులు ఉన్నాయి. జైలులో వీరికి పరిచయం ఏర్పడడంతో మరిన్ని చోరీలకు కలిసికట్టుగా చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా చిన్న బజార్ PS పరిధిలో <<19323990>>చేతివాటం<<>> చూపగా ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.63 వేల నగదు, 153 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

News March 8, 2026

ములుగులో అంతర్జాతీయ సదస్సు

image

ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 10, 11 తేదీల్లో “కథా సాహిత్యం-సామాజిక చైతన్యం” అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు బ్రోచర్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. కథా సాహిత్యం, సామాజిక చైతన్యానికి మధ్య గల సంబంధాన్ని అంతర్జాతీయ కోణంలో ఈ సదస్సులో చర్చించనున్నట్లు సంచాలకులు బి.బాలయ్య తెలిపారు.

News March 8, 2026

గద్వాల కీర్తి పతాక.. మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ

image

గద్వాల సంస్థానపు చివరి పాలకురాలు మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ మహిళా లోకానికి స్ఫూర్తిప్రదాత. 1946-49 మధ్య పాలన సాగించిన ఆమె, నిజాం నవాబును ఎదిరించి న్యాయపోరాటం ద్వారా సంస్థానాన్ని నిలబెట్టుకున్నారు. సాహిత్య పోషణలో గద్వాలకు ‘విద్వద్గద్వాల’గా కీర్తి తెచ్చారు. ఆమె స్మరణార్థం కోటలో ఏర్పాటు చేసిన MALD డిగ్రీ కళాశాల జిల్లాలోనే మొదటిది. 1953 ఆగస్టు 18న ఆమె కన్నుమూశారు. # నేడు అంతర్జాతీయ మహిళ దినోత్సవం.