News March 19, 2024
అల్లూరి జిల్లాలోని చట్టి చెక్ పోస్టు మూసివేత
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులను G.O.MS-24 ప్రకారం మూసివేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న చింతూరు మండలంలోని రవాణా శాఖ చట్టి చెకపోస్ట్‌ను కూడా మూసివేయటం జరిగిందని జిల్లా రవాణాధికారి లీలా ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఇతర రాష్ట్ర వాహనదారులు పన్నులు, పర్మిట్లు ఇతర సేవలను ఆన్లైన్లో తీసుకోవాలని సూచించారు.
Similar News
News October 31, 2024
విశాఖలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు
నవంబర్ 02న సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఇతర అధికారులతో కలిసి సీఎం హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే కోస్టల్ బ్యాటరీ ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. కోస్టల్ బ్యాటరీ వద్దకు శనివారం మధ్యాహ్నం చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కలెక్టరేట్‌కు వస్తారని అన్నారు.
News October 31, 2024
విశాఖలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికాలోని గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ క్లౌడ్ సీఈవో, వైస్‌ప్రెసిడెంట్‌ను కోరారు. ఏపీలో ఈ- గవర్నెన్స్, డిజిటల్ విద్యకు సహకరించాలని మీటింగ్‌లో ప్రతిపాదించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి తోడ్పాటుతో పాటు స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని మంత్రి లోకేశ్ కోరినట్లు టీడీపీ ట్వీట్ చేసింది.
News October 30, 2024
విశాఖలో సమీక్ష నిర్వహించనున్న సీఎం
జిల్లాలో ఈనెల 2వ తేదీన సీఎం పర్యటనకు సంబంధించి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని, సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్రప్రసాద్ ఆదేశించారు. బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టరేట్లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.