News February 7, 2025

కొణిజర్ల: కాల్వలో ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి

image

ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి చెందిన ఘటన గురువారం కొణిజర్ల మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..పెద్దగోపతికి చెందిన తడికమళ్ల రవి తన మిత్రులతో కలిసి మొక్కజొన్న పంటకు నీరు కట్టేందుకు ట్రాక్టర్‌పై జనరేటర్ తీసుకుని బయలుదేరాడు. రాపల్లె మేజర్ కాల్వ మీదుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కాల్వలో పడింది. రవిపై ఇంజిన్ తిరగబడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News February 7, 2025

ఖమ్మం: రుణ మంజూరులో వెనుకంజ..!

image

ఖమ్మం జిల్లా స్వయం సహాయక సంఘాలకు రుణ మంజూరు ప్రక్రియలో వెనుకంజలో ఉంది. మొత్తం 21,348 స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.1,113.32 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. డిసెంబర్, జనవరికల్లా ఈ లక్ష్యాన్ని పూర్తిచేయడం ఆనవాయితీ. కానీ ఫిబ్రవరి మొదటి వారం దాటుతున్నా 7,774 సంఘాలకు రూ.738.79 కోట్ల (66.36 శాతం) మేర మాత్రమే రుణం అందించగలిగారు.

News February 7, 2025

ఖమ్మం: వినూత్న ప్రయోగం.. విద్యార్థులకు కలెక్టర్ లేఖ

image

పదో తరగతి ఫలితాల్లో 100% సాధించడమే లక్ష్యంగా విద్యార్థుల్లో భయం పోగొట్టడం, ధైర్యంగా హాజరయ్యేలా సిద్ధం చేసేందుకు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన సదస్సుకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హాజరు కాగా మంచి స్పందన వచ్చింది. దీంతో ప్రతీ విద్యార్థికి తన సంతకంతో కూడిన లేఖ అందించాలని ఆయన నిర్ణయించారు. ఈవిషయమై డీఈవో ఉద్యోగులతో లేఖ తయారీపై సమీక్షించారు.

News February 7, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

error: Content is protected !!