News March 19, 2024

HYD: ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగింది: కిషన్ రెడ్డి

image

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరుతో దేశ ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం HYD బర్కత్‌పురలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో డాక్టర్ కేఎస్ సోమశేఖర్ రావుకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. మోదీ పాలనలో అభివృద్ధిని కొనసాగించేందుకు బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News September 8, 2025

వామ్మో: HYDలో 32 వేల టన్నుల వ్యర్థాల తొలగింపు

image

సిటీలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఇక శానిటేషన్‌పై GHMC ఫోకస్ చేసింది. నిన్నటి వరకు 20 వేల టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించింది. పారిశుద్ధ్య కార్మికులు రోజుకు 1500 నుంచి 1600 టన్నుల చెత్తను సేకరించి, జవహర్‌నగర్‌లోని ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలించారు. సాగర్‌లో 12 వేల టన్నుల విగ్రహ వ్యర్థాలు బయటపడటం గమనార్హం. ప్రస్తుతం నిమజ్జన పాయింట్లు, ఊరేగింపు మార్గాలలో పనులు కొనసాగుతున్నాయి.

News September 8, 2025

HYD: 17 ఏళ్లుగా లడ్డూ సొంతం

image

హెచ్‌ఎఫ్‌నగర్‌ ఫేజ్‌1 బస్తీలో ఓ భక్తుడు 17 సంవత్సరాలుగా వేలం పాటల్లో లడ్డూను సొంతం చేసుకుంటున్నాడు. హెచ్‌ఎఫ్‌నగర్‌ ఫేజ్‌1 బస్తీలో మండపం వద్ద మునేశ్వర్ తొలిసారి రూ. 600 నుంచి చెల్లించి లడ్డూను కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత వరుసగా పదహారు సంవత్సరాలు ఆయనే లడ్డూను సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా రూ 2.10 లక్షలకు మరోసారి లడ్డూను సొంతం చేసుకోవడం విశేషం.

News September 8, 2025

అక్షరాస్యతలో HYD టాప్

image

అక్షరాస్యతలో రాజధాని తొలి స్థానంలో కొనసాగుతోంది. 2011 గణంకాలను పరిశీలిస్తే.. తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ 83.25%తో అక్షరాస్యతలో టాప్‌లో ఉంది. మేడ్చల్ మల్కాజిగిరి: 82.49% 2వ స్థానం, హన్మకొండ-74.13% 3వ స్థానం, రంగారెడ్డి: 71.88 % 4వ స్థానంలో ఉన్నాయి. ఇక వికారాబాద్ జిల్లా అక్షరాస్యతలో 57.91%తో వెనుకబడింది. మెరుగైన సమాజం కోసం చదవండి.. చదివించండి.
నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం.