News February 7, 2025

మరోసారి.. ఢిల్లీ స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు

image

దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఇవాళ ఉదయం మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఢిల్లీతో పాటు నోయిడాలోని పాఠశాలలకు కూడా ఈ థ్రెట్స్ రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయా స్కూళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Similar News

News January 7, 2026

దావోస్‌లో ఫోర్త్ సిటీపై సీఎం ప్రజెంటేషన్

image

TG: దావోస్ పర్యటనలో CM రేవంత్ రెడ్డి ‘World Economic Forum’ సదస్సులో “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్‌పై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారబోతున్నHYD ‘ఫోర్త్ సిటీ’ గురించి ప్రత్యేకంగా వివరించనున్నారు. తెలంగాణ రైజింగ్‌పై సమగ్ర నివేదికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. జనవరి 19-23 వరకు ప్రపంచ ఆర్థిక వేదికలో TG పెవిలియన్‌లో ఫోర్త్ సిటీ నమూనాను ప్రదర్శించనున్నారు.

News January 7, 2026

రేపు అంతరిక్షంలోకి నాసా వ్యోమగాములు

image

ఈ ఏడాది తొలి స్పేస్ వాక్ కోసం ISS బృందం సిద్ధమైంది. నాసా వ్యోమగాములు మైక్ ఫిన్కే, జెనా కార్డ్‌మ్యాన్ రేపు సాయంత్రం 6.30 గంటలకు అంతరిక్ష కేంద్రం వెలుపలికి రానున్నారు. సుమారు ఆరున్నర గంటల పాటు సాగే ఈ ప్రక్రియలో వారు కొత్త సోలార్ ప్యానెల్స్ అమరికకు అవసరమైన కిట్‌లను ఇన్‌స్టాల్ చేస్తారు. అలాగే అంతరిక్షంలో సూక్ష్మజీవుల నమూనాలను సేకరించడం వంటి పనులు చేస్తారు.

News January 7, 2026

రాయలసీమ లిఫ్ట్ అంటూ అడ్డగోలుగా పనులు చేశారు: CBN

image

AP: అనుమతులు లేనందునే రాయలసీమ లిఫ్ట్‌ను NGT నిలిపేసిందని CM CBN స్పష్టం చేశారు. ‘రూ.3,528 కోట్లతో దీన్ని చేపట్టారు. రూ.2,500 కోట్లు ఖర్చుచేశారు. అడ్డగోలుగా పనిచేశారు. కాంట్రాక్టరుకే రూ.900 కోట్లిచ్చారు. ముచ్చుమర్రి నుంచి నీటి తరలింపు అవకాశమున్నా దీన్ని చేపట్టారు. NGT జరిమానా వేసింది’ అని పేర్కొన్నారు. అబద్ధం వందసార్లు చెబితే నిజమైపోదని, తనపై బురదచల్లితే వారికే నష్టం అని అన్నారు.