News February 7, 2025

UPDATE: గజ్వేల్ మృతులు గోదావరిఖని వాసులు

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ రహాదారిపై జరిగిన <<15384831>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతులు గోదావరిఖని వాసులుగా పోలీసులు గుర్తించారు. గోదావరిఖనికి చెందిన బాణేశ్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో గజ్వేల్ వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

Similar News

News March 31, 2026

KU డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

కేయూ పరిధిలోని డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలను మంగళవారం అధికారులు విడుదల చేశారు. 2025 నవంబరులో నిర్వహించిన 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి పునః మూల్యాంకనం కోరిన విద్యార్థుల ఫలితాలు వెలువడ్డాయని వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://www.kuonline.co.in/ ద్వారా చూసుకోవచ్చని సూచించారు.

News March 31, 2026

PHOTOS: కోదండరాముడి కళ్యాణానికి ముస్తాబైన ఒంటిమిట్ట

image

AP: ఒంటిమిట్టలో రేపు జరగబోయే కోదండరాముడి కళ్యాణానికి TTD భారీ ఏర్పాట్లు చేసింది. వేడుక జరిగే ప్రధాన వేదికతో పాటు భక్తులు కూర్చొనేందుకు ఆలయ సమీపంలో గ్యాలరీలు ఏర్పాటయ్యాయి. వేలాదిగా తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించనుంది. అలాగే కళ్యాణం అనంతరం తలంబ్రాల ప్యాకెట్లు, శ్రీవారి ప్రసాదం ఇవ్వనుంది. సీఎం చంద్రబాబు రేపు సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొననున్న విషయం తెలిసిందే.

News March 31, 2026

గ్రామ సభల్లో సంక్షేమ పథకాలను వివరించాలి: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో వచ్చే నెల 2 తేదీన గ్రామసభలను నిర్వహించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి వారి నుంచి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. జిల్లా, డివిజన్, మండలం, గ్రామస్థాయి వరకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు.