News February 7, 2025

దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

image

ఏలూరులోని నగల దుకాణంలో భారీ చోరీకి పాల్పడిన<<15384948>> దొంగలను<<>> పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులు అంతర్‌రాష్ట్ర ముఠాగా గుర్తించిన పోలీసులు వారు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు తెలిసి అక్కడకు వెళ్లారు. వారి గ్రామాల సమీపంలో మాటు వేసి పట్టుకున్నారు. నిందితులపై ఏలూరు పరిధిలో దాదాపు 10 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News November 23, 2025

యువకులు గల్లంతుపై ఇన్‌ఛార్జి మంత్రి ఆరా

image

కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యాంలో ముగ్గురు యువకులు గల్లంతుపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. సివిని గ్రామానికి చెందిన యువకులని మంత్రికి వివరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించినట్లు తెలిపారు.

News November 23, 2025

వేగంగా కోలుకుంటున్న శ్రేయస్

image

ఆసీస్‌తో ODI సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై PBKS కో ఓనర్ ప్రీతిజింటా అప్డేట్ ఇచ్చారు. ఆ జట్టు ప్లేయర్ శశాంక్ సింగ్ బర్త్‌డే పార్టీలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. శ్రేయస్ అద్భుతంగా రికవరీ అవుతూ బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా SAతో ODI సిరీస్‌కు అతను ఇప్పటికే దూరమయ్యారు. జనవరిలో NZతో జరిగే వన్డేలకు అందుబాటులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

News November 23, 2025

కొమరాడ: రబ్బర్ డ్యాంలో ముగ్గురు గల్లంతు

image

కొమరాడలోని జంఝావతి నదిపై ఉన్న రబ్బర్ డ్యాంలో ఆదివారం సాయంత్రం స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని శివిని గ్రామానికి చెందిన గోవింద నాయుడు, సంతోష్ కుమార్, అరసాడ్ ప్రదీప్‌లు రబ్బర్ డ్యాంను చూసేందుకు వచ్చి స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్సై నీలకంఠం తెలిపారు.