News February 7, 2025

కుంభమేళాకు అమలాపురం నుంచి ప్రత్యేక బస్సులు

image

మహా కుంభమేళ యాత్రకు వెళ్లేందుకు భక్తుల కోసం ఆర్టీసీ అమలాపురం డిపో నుంచి బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. 8 రోజులు పాటు జరిగే యాత్రలో భువనేశ్వర్, పూరి, కోణార్క్, ప్రయాగరాజ్, కుంభమేళా, వారణాసి, అయోధ్య, గయ, బుద్ధ గయ, అరసవిల్లి, శ్రీకూర్మం త్రివేణి సంగమం క్షేత్రాలు వెళ్లవచ్చని తెలిపారు.

Similar News

News February 7, 2025

ఇన్ఫో‌సిస్‌లో మరోసారి లేఆఫ్స్?

image

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫో‌సిస్‌ మరోసారి లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. మైసూర్ క్యాంపస్‌లో దాదాపు 700 మంది ట్రైనీ ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో భాగంగా నిర్వహించిన ఎవాల్యుయేషన్ పరీక్షల్లో వీరందరూ ఫెయిల్ కావడంతోనే ఇంటికి పంపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తమను ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతోనే పరీక్షలు కఠినంగా నిర్వహించారని ఉద్యోగులు వాపోతున్నారు.

News February 7, 2025

జనగామ: 30 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్

image

జనగామ జిల్లా కలెక్టరేట్లోని సమాచార పౌరసంబంధాల శాఖ, విద్యా శాఖ, ఉద్యానవన శాఖ, పంచాయతీ శాఖతో పాటు పలు కార్యాలయాలను కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మూమెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. సమయానుగుణంగా కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. సమయపాలన పాటించని 30 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధులకు హాజరుకాని వారి వివరాలపై ఆరా తీశారు.

News February 7, 2025

విశాఖ: ఎమ్మెల్సీ స్థానానికి మరో మూడు నామినేషన్లు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం మూడు నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు సంబంధిత పత్రాలు అందజేసి నామినేషన్ దాఖలు చేశారు. వారిలో నూకల సూర్యప్రకాష్, రాయల సత్యనారాయణ, గాదె శ్రీనివాసులు నాయుడు ఉన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ వారి చేత ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి.

error: Content is protected !!