News February 7, 2025

రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గోదావరిఖని వాసులు మృతి

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గోదావరిఖని నుంచి HYD వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న గోదావరిఖనికి చెందిన బాణేష్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్‌కు తరలించారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 25, 2025

కమ్మర్‌పల్లి: కారు ఢీ.. ఒకరి మృతి

image

కమ్మర్‌పల్లి మండలం రాజరాజేశ్వరి నగర్‌లో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాల గంగాధర్(70) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కారు వెనక నుంచి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది గంగాధర్‌ను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

News December 25, 2025

ప్రస్తుతం నా క్రష్ మృణాల్ ఠాకూర్: నాగవంశీ

image

హీరోయిన్లలో రష్మిక అంటే ఇష్టమని, మృణాల్ ఠాకూర్ తన క్రష్ అని నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరోవైపు Ntr నటించిన ‘వార్-2’కు భారీ నష్టాలంటూ జరిగిన ప్రచారంపై ఆయన స్పందించారు. ‘తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను రూ.68 కోట్లకు కొన్నాను. దానికి రూ.35-40 కోట్ల షేర్ వచ్చింది. ఈ క్రమంలో ఆ మూవీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ పిలిచి రూ.18 కోట్లు వెనక్కి ఇచ్చింది. పెద్దగా నష్టాలు రాలేదు’ అని పేర్కొన్నారు.

News December 25, 2025

నిజామాబాద్: ఇండో-నేపాల్ రుద్రాక్ష నూతన శాఖ ఏర్పాటు

image

ప్రముఖ రుద్రాక్ష నిపుణుడు వేద గణిత శాస్త్రవేత్త డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇండోనేపాల్ ఆర్గనైజేషన్ నూతన శాఖను నిజామాబాద్‌లో ఏర్పాటు చేశారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ కేశవ్ వేణు గురువారం ప్రారంభించారు. పాండురంగారావు మాట్లాడుతూ.. ఈ శాఖలో అరుదైన రుద్రాక్షలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ రాజారెడ్డి, సినీ రచయిత సతీశ్ పాల్గొన్నారు.