News February 7, 2025

ప్రియురాలికి ఎలుకల మందు ఇచ్చిన ఉద్యోగిపై కేసు: సీఐ

image

ప్రియురాలికి ఓ సచివాలయ ఉద్యోగి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటన ప్రత్తిపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. సచివాలయ ఉద్యోగి ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించి ఉద్యోగం వచ్చాక పెళ్లికి నిరాకరించాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఇంట్లోకి పెళ్లికి ఒప్పుకోవడం లేదని నమ్మబలికి ప్రియురాలికి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించాడు. 

Similar News

News April 2, 2026

GNT: ధాన్యం బకాయిల చెల్లింపులో ఆలస్యం.. రైతుల ఆందోళన

image

ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించిన ప్రభుత్వం, ఇతర బకాయిలలో జాప్యం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. రవాణా ఖర్చులు, గన్నీ సంచుల కోసం రూ.33 కోట్లకు పైగా రైతులకు చెల్లించాల్సి ఉంది. బాపట్ల జిల్లాకే ఎక్కువ భాగం ఉంది. గుంటూరు, పల్నాడు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. హమాలీ చార్జీలు ఇప్పటికే ఇచ్చారు. రబీ సీజన్ ప్రారంభం కావడంతో పెండింగ్ మొత్తాలు వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

News April 1, 2026

GNT: ఈ ప్రాంతాల్లోనే పెరిగిన వార్డుల సంఖ్య

image

@తెనాలి ప్రస్తుతం 40 వార్డులు ఉండగా 52కు పెరిగాయి
@రేపల్లె ప్రస్తుతం 28 వార్డులు ఉండగా -36కు పెరిగాయి
@మాచర్ల ప్రస్తుతం 31 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@సత్తెనపల్లి ప్రస్తుతం 31 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@వినుకొండ ప్రస్తుతం 32 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@గురజాల ప్రస్తుతం 20 వార్డులు ఉండగా 23కు పెరిగాయి

News April 1, 2026

ఉమ్మడి గుంటూరుకు వైద్యుల నియామక ఉత్తర్వులు

image

రాష్ట్రవ్యాప్తంగా 482 మంది వైద్యులకు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జిల్లాల వారీగా పంపిణీలో పల్నాడు జిల్లాకు 26 మంది, గుంటూరు జిల్లాకు 14 మంది వైద్యులను కేటాయించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో సేవలందించేందుకు వీరిని నియమించగా, 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని సూచించారు. ఆన్‌లైన్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా పోస్టింగులు ఇచ్చినట్లు వెల్లడించారు.