News February 7, 2025
నేడు వడ్డీ రేట్లు ప్రకటించనున్న ఆర్బీఐ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738902046170_1045-normal-WIFI.webp)
ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల్ని కాసేపట్లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించనున్నారు. కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెషన్ ఆరంభ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 87.80 పాయింట్లు పెరిగి 78,145.96 వద్ద ఉంది. నిఫ్టీ 35.05 పాయింట్లు లాభపడి 23,638 వద్ద ట్రేడయింది.
Similar News
News February 7, 2025
Stock Markets: పుంజుకొని మళ్లీ పడిపోయిన సూచీలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_112024/1731406722194_1124-normal-WIFI.webp)
నేడు బెంచ్‌మార్క్ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,559 (-43), సెన్సెక్స్ 77,860 (-197) వద్ద ముగిశాయి. రెపోరేటు తగ్గించడంతో పుంజుకున్న సూచీలు మధ్యాహ్నం ఇంట్రాడే కనిష్ఠానికి చేరాయి. ఆఖర్లో కాస్త పెరిగి నష్టాలను తగ్గించుకున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, FMCG, O&G షేర్లు పడిపోయాయి. మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆటో షేర్లు ఎగిశాయి. టాటాస్టీల్, ITC హోటల్స్, AIRTEL, JSW స్టీల్, TRENT టాప్ గెయినర్స్.
News February 7, 2025
దారుణం.. రైల్లోంచి గర్భిణిని నెట్టేసిన దుండగుడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736062014582_81-normal-WIFI.webp)
తిరుపతి-కోయంబత్తూరు మధ్య ప్రయాణించే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు గర్భిణిని లైంగిక వేధింపులకు గురిచేసి, రైల్లోంచి కిందకి నెట్టివేశాడు. ఈ ఘటన కేవీ కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రక్తపుమడుగులో పడి ఉన్న మహిళను జోలార్‌పేట పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన వేలూరు కేవీ కుప్పంకు చెందిన హేమరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
News February 7, 2025
మహాకుంభమేళా @40 కోట్ల మంది భక్తులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738922714148_782-normal-WIFI.webp)
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నేటి వరకు 40 కోట్ల మందికి పైగా త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇవాళ కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.