News March 19, 2024
ఓయూ బీసీఏ పరీక్షా ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 1, 2025
HYD: రెండు నెలల బాలుడి హత్య.. జీవిత ఖైదు
ఆడపడుచుకు పిల్లలు పుట్టారని, తనకు సంతానం కలగలేదని అసూయ, కక్షతో రెండు నెలల పసిబాలుడిని హత్య చేసిన నిందితురాలికి జీవిత ఖైదు శిక్ష పడింది. అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధిలో అనాజ్‌పూర్‌కు చెందిన ఓరుగంటి శ్వేత గౌడ్(21)ని RR జిల్లా కోర్టు జడ్జి P.ప్రదీప్ నాయక్ మంగళవారం దోషిగా నిర్ధారించారు. ఆమెకు జీవిత ఖైదు, రూ.10,000 జరిమానా విధించారు. కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ K.జ్యోతిరెడ్డి వాదనలు వినిపించారు.
News January 1, 2025
తెలంగాణలోనే మన రంగారెడ్డి TOP
తెలంగాణ రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిలో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉందని TGFDS తెలిపింది. అంతేకాక అత్యధిక మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లను కలిగి ఉన్నట్లుగా పేర్కొంది. RR జిల్లాలోని యాచారం, మహేశ్వరం, మంచాల, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల సహా అనేక ప్రాంతాల నుంచి పాడి రైతులు పాల వ్యాపారాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లు తెలిపింది. HYD నగరం రంగారెడ్డి జిల్లాకు ఆనుకొని ఉండటం గొప్ప వరంగా అభిప్రాయపడింది.
News January 1, 2025
HYD: 2025 నుంచి రైళ్ల టైమింగ్స్ చేంజ్
రైళ్ల నూతన టైం టేబుల్ 2025 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) తెలిపింది. MMTS రైళ్లు సికింద్రాబాద్- మేడ్చల్, ఫలక్ నూమ- ఉందానగర్, ఘట్కేసర్- లింగంపల్లి మధ్య నడిచే 88రైళ్లకు మార్పు చేసినట్లు పేర్కొంది.ప్రయాణించే ముందు ఆయా రైల్వే స్టేషన్ వద్ద టైమింగ్స్ తెలుసుకోవాలని పేర్కొంది. ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లే పలు రైళ్ల వేళల్లో చేసిన మార్పులు సైతం JAN1 నుంచి వర్తిస్తాయంది.