News February 7, 2025
చిత్తూరు: అంత్యక్రియల్లో అపశ్రుతి

అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో బాణసంచా పేలి పలువురికి గాయాలైన ఘటన గంగవరం మండలంలో జరిగింది. దండపల్లి గ్రామానికి చెందిన మునివెంకటమ్మ(82) మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. బాణసంచా పేల్చే క్రమంలో సంచిలో ఉన్న టపాకాయలకు నిప్పు అంటుకుని బాణసంచా జనంపైకి దూసుకెళ్లింది. దీంతో వెంకటరమణ, కుమార్, చిన్నబ్బ, చిన్నన్న, గురవయ్య, కుమార్ బాబుకి గాయాలు కాగా వారిని పలమనేరు, చిత్తూరులోని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 31, 2026
చిత్తూరు: రేపే కేంద్ర బడ్జెట్.. వీటికి నిధులు అందేనా.!

కీలక రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. కుప్పం–మారికప్పం రెండో రైల్వే లైన్‌కు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో కుప్పం నుంచి KGF మీదుగా బెంగళూరుకు దూరం తగ్గనుంది. నడికుడి–శ్రీకాళహస్తి లైన్ పూర్తయితే గుంటూరు నుంచి తిరుపతి, చిత్తూరుకు ప్రయాణం మరింత సులువు కానుంది. అమరావతి–బెంగళూరు హైస్పీడ్ రైల్ ప్రతిపాదన ఉంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం వీటికి ఏ మేర నిధులు కేటాయిస్తుందో చూడాలి.
News January 31, 2026
చిత్తూరు జిల్లాకు రూ.118.65 కోట్ల విడుదల

చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 2,75,073 మందికి రూ.118.65 కోట్లు విడుదలయ్యాయి. గుడుపల్లె మండలం బెగ్గిలిపల్లె పంచాయతీలో సీఎం చంద్రబాబు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకెళ్లి పింఛన్లు అందజేయనున్నారు.
News January 31, 2026
నేడు CM చంద్రబాబు పర్యటన వివరాలు

CM చంద్రబాబు శనివారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటకు కడపల్లి ఇంటి నుంచి గుడిపల్లి (M) బెగ్గిలిపల్లిలో లబ్ధిదారుల వద్దకు వెళ్లి NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. 10:40 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శాంతిపురం (M) తులసి నాయన పల్లి వద్ద ప్రజా వేదిక బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఈ-సైకిళ్ల పంపిణీపై గిన్నిస్ బుక్ ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు అధికారిక సమాచారం వెలువడింది.


