News February 7, 2025

సంగారెడ్డి: అప్పుడే మండుతున్న ఎండలు

image

గత కొన్నిరోజులుగా సంగారెడ్డి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్‌లో 35.8 డిగ్రీలు నమోదైంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పొద్దున, సాయంత్రం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ పగటి పుట ఉష్ణోగ్రతలు సుర్రుమంటున్నాయి.

Similar News

News March 10, 2026

స్వచ్ఛ విద్యాలయాల సర్టిఫికేట్లు అందజేసిన కలెక్టర్

image

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛహరిత విద్యాలయంలో భాగంగా జిల్లాలోని అన్నీ పాఠశాలలను పరిశీలించారు. ఇందులో భాగంగా నీటి వసతి, మరుగుదొడ్ల పరిశుభ్రత, హ్యాండ్ వాషింగ్, పాఠశాలలో చెట్ల పెంపకం వంటి కార్యక్రమాలను సర్వే చేసి మొత్తం 8 ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ 8 ఉత్తమ పాఠశాలల HMలకు కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు.

News March 10, 2026

నెల్లూరు జిల్లాలో ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ ముమ్మరం

image

పిల్లల రక్షణే ధ్యేయంగా నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాలతో ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా సాగుతోంది. శక్తి బృందాలు పాఠశాలల్లో ఫొక్సో (POCSO) చట్టం, బాల్య వివాహాల నిర్మూలన, డ్రగ్స్ నిరోధంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటూ, ఆపదలో 100, 112, 1098 నంబర్లను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.

News March 10, 2026

పోలీస్‌ అధికారి అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ..!

image

వ్యాపారం ముసుగులో ఓ <<19334509>>పోలీస్ <<>>అధికారి కుటుంబం చేసిన మోసాలపై విజిలెన్స్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న సదరు అధికారి కుటుంబంతో బాధితుడు జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. అమ్మపాలెంలోని సర్వే నంబర్ 593/2లో ఉన్న వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారంపై అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగడం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.