News February 7, 2025
Good News: వడ్డీరేట్లు తగ్గించిన RBI
ఎట్టకేలకు RBI గుడ్‌న్యూస్ చెప్పింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల మేర కత్తిరిస్తూ నిర్ణయం తీసుకుంది. 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గించింది. 2024, Feb 8 నుంచి వడ్డీరేట్లు 6.50% వద్దే గరిష్ఠంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం కుదుటపడుతోందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్ర తెలిపారు. వడ్డీరేట్ల తగ్గింపుతో ప్రజల చేతుల్లో డబ్బులు మిగులుతాయి. దీంతో వినియోగం పెరిగి ఎకానమీ పుంజుకోనుంది.
Similar News
News February 7, 2025
వివేకా కేసులో జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?: దస్తగిరి
AP: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని కడపలో విచారణ అధికారి 3గంటల పాటు ప్రశ్నించారు. గతేడాది జైలులో తనను ఇబ్బందులు పెట్టారని ఆయన ఇటీవల ఫిర్యాదు చేయగా విచారణకు పిలిచారు. దస్తగిరి మాట్లాడుతూ.. ‘వివేకా హత్య కేసులో జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. ఈ కేసులో త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. ప్రభుత్వానికి ఈ కేసు సవాల్ లాంటిది’ అని అన్నారు.
News February 7, 2025
చేతిరాత మార్చుకోలేకపోయా: మోదీ
తన విద్యార్థి దశలో చేతిరాత బాగుండేది కాదని, దానిని మార్చడానికి ఉపాధ్యాయులు చాలా శ్రమించేవారని ప్రధాని మోదీ విద్యార్థులకు తెలిపారు. అయినప్పటికీ చేతిరాత మారలేదన్నారు. ఫిబ్రవరి 10న ‘పరీక్షా పే చర్చ’ జరగనున్ననేపథ్యంలో ఢిల్లీలోని సుందర్ నర్సరీలో విద్యార్థులతో చర్చాకార్యక్రమం నిర్వహించారు. ఈసారి ‘పరీక్షా పే చర్చా’లో దీపికా పదుకొణే, బాక్సర్ మేరీకోమ్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
News February 7, 2025
అత్యధిక విద్యావంతులున్న దేశాలివే!
ప్రపంచంలోనే జపాన్‌లో అత్యధికంగా విద్యావంతులు ఉన్నట్లు తాజాగా విడుదలైన ఓ నివేదికలో వెల్లడైంది. ఇండియా 53వ స్థానంలో ఉండగా చైనా 27, అమెరికా 22వ స్థానాల్లో ఉన్నాయి. విద్యావంతులు కలిగిన దేశాల జాబితా వరుసగా.. జపాన్, స్వీడన్, స్విట్జర్లాండ్, జెర్మనీ, డెన్మార్క్, కెనడా, నార్వే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్, సౌత్ కొరియా, ఐర్లాండ్, ఇటలీ, USA, స్పెయిన్, చైనా, రష్యా, UAE ఉన్నాయి.