News February 7, 2025

కరీంనగర్: ఈనెల 17 నుంచి MBA, MCA పరీక్షలు

image

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని MBA, MCA మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. ఎన్. వి శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, MCA థియరీ పరీక్షలు 22న, MBA థియరీ పరీక్షలు 24 న ముగియనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

Similar News

News November 6, 2025

సిరిసిల్ల: ఆఫీసర్‌కు దక్కిన అరుదైన గౌరవం..!

image

తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతన ఇందిరమ్మ గృహం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ హాజరయ్యారు. కాగా, కార్యక్రమానికి అధికారులు అన్నీ ఏర్పాట్లను చేసి సిద్ధంగా ఉంచారు. ఈ క్రమంలో హాజరైన కలెక్టర్ హౌసింగ్ AE అబ్దుల్ హమీద్‌తో రిబ్బన్ కట్ చేయించి ప్రారంభోత్సవం జరిపిచండంతో ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఏఈ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

News November 6, 2025

బిహార్ అప్డేట్: 11 గంటల వరకు 27.65% పోలింగ్

image

బిహార్‌లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులుదీరారు. సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News November 6, 2025

ఉపఎన్నిక ప్రచారానికి కేసీఆర్ ఇక రానట్టేనా!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి KCR రానట్లేనని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నిక బాధ్యతను పూర్తిగా కేటీఆరే తీసుకున్నారు. ఇప్పుడు ప్రచార పర్వం రేవంత్ vs KTRగా వేడెక్కింది. తండ్రి మరణంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న హరీశ్ రావు ఈ 3 రోజులు యాక్టివ్ కానున్నారు. KCR ఒక్కసారి రావాలని పార్టీ క్యాడర్ ఆశిస్తున్నా… గెలుస్తామనే ధీమా, అనారోగ్యం కారణంగా ఆయన వచ్చే అవకాశం కనిపించడం లేదు.