News February 7, 2025

బీసీలకు 42శాతం సీట్లు ఇచ్చేందుకు మేం సిద్ధం: పొన్నం

image

TG: ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కులగణనను తమ ప్రభుత్వం పక్కాగా పూర్తి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు మా పార్టీ సిద్ధం. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగనివ్వం. కులగణనను దేశం మొత్తం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. BRS నేతలు సర్వేలో పాల్గొనలేదు. పైగా అవహేళన చేశారు. వెనుకబడిన వర్గాలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News February 7, 2025

సీఎంతో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం ఇవాళ సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2047- విజన్ డాక్యుమెంట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.

News February 7, 2025

మీ డ్రీమ్స్‌లోనూ ఇవే వస్తుంటాయా?

image

మన దగ్గర ఎక్కువ మంది కలలో పాము కనిపించిందని చెప్తుంటారు. అయితే, దేశాలను బట్టి వారి డ్రీమ్స్‌లో వచ్చేవి కూడా మారుతాయని ఓ అధ్యయనంలో తేలింది. అర్జెంటీనాలో ఎక్కువ మందికి స్పైడర్స్, AUS & కెనడా వారికి పళ్లు ఊడిపోయినట్లు, బంగ్లాదేశ్ ప్రజలకు పెళ్లి జరిగినట్లు కలలొస్తాయి. ఫ్రాన్స్ ప్రజలకు తమ మాజీ గర్ల్‌ఫ్రెండ్ డ్రీమ్స్‌లోకి వస్తుందని చెప్పారు. బ్రెజిల్ & ఆస్ట్రియా వాళ్ల డ్రీమ్స్‌లో మోస్ట్ కామన్ పామే.

News February 7, 2025

పాక్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేసిన ఫిఫా

image

పాకిస్థాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(PFF)ను ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(FIFA) సస్పెండ్ చేసింది. నిబంధనలను పాటించడంలో విఫలమైందని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. PFFలో సజావుగా ఎన్నికల నిర్వహణ, గ్రూపిజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా 2019లో నార్మలైజేషన్ కమిటీని ఫిఫా ఏర్పాటు చేసింది. కానీ సత్ఫలితాలు రాలేదు. దీంతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2017 నుంచి PFF సస్పెన్షన్‌కు గురికావడం ఇది మూడోసారి.

error: Content is protected !!