News February 7, 2025
మాజీ మంత్రి అంబటి ట్వీట్‌కి టీడీపీ నేత బుద్దా రిప్లై

ఎన్టీఆర్: రాష్ట్ర మంత్రుల ర్యాంకులలో 8,9 స్థానాలలో ఉన్న లోకేశ్, పవన్‌లకు అభినందనలు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మాజీ MLC బుద్ధా వెంకన్న శుక్రవారం రిప్లై ఇచ్చారు. 8,9 స్థానాలలో ఉన్న మంత్రులు లోకేశ్, పవన్‌లు 1,2 స్థానాలలోకి రావడానికి కృషిచేస్తున్నారని, మాజీ సీఎం జగన్ మాత్రం 11వ స్థానంలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.
Similar News
News March 22, 2026
MNCL: రూమ్మేట్స్ మధ్య గొడవ.. ఒకరి హత్య

మద్యం మత్తులో జరిగిన గొడవ ఒక కూలీ ప్రాణం తీసింది. మహారాష్ట్రకు చెందిన దీపక్ (35) తన స్నేహితులు దీపక్, సంజీవ్‌లతో MNCL కాలేజీ రోడ్‌లో నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ముగ్గురి మధ్య వివాదం తలెత్తగా, మిగిలిన ఇద్దరు దీపక్‌పై రాడ్‌తో దాడి చేసి పారిపోయారు. తీవ్ర గాయాలైన బాధితుడు శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
News March 22, 2026
సినిమా కోసం 10 కేజీల బరువు తగ్గిన ఎన్టీఆర్!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం Jr.NTR స్ట్రిక్ట్ డైట్ పాటిస్తున్నారని ఆయన ట్రైనింగ్ టీమ్ వెల్లడించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 7 వారాల్లో 10kgs బరువు తగ్గారని తెలిపాయి. డైరెక్టర్ లీన్ ఫిజిక్ కావాలని చెప్పడంతో రోజూ 90min ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తూ కంట్రోల్ డైట్ పాటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ HYDలో జరుగుతోంది. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
News March 22, 2026
భద్రకాళీ తీరం ఆహ్లాదం.. ఆధ్యాత్మికం..!

వరంగల్ నగర నడిబొడ్డున 12వ శతాబ్దంలో కాకతీయ రాజు గణపతి దేవుడు నిర్మించిన భద్రకాళి చెరువు తీరం ఆహ్లాదంతో పాటు, ఆధ్యాత్మికతను అందిస్తుంది. సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో రెండు కిలోమీటర్ల పొడవులో మానవ నిర్మిత ఈ కృత్రిమ సరస్సు. చెరువు ఒడ్డున భద్రకాళి అమ్మవారు, బండ్, కొండలు, రాతి నిర్మాణాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఇటీవల చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.
# నేడు ప్రపంచ జల దినోత్సవం.


