News February 7, 2025
బతికున్న మనిషికి డెత్ సర్టిఫికెట్..!
మనిషి బతికుండగానే చనిపోయినట్లు సర్టిఫికెట్ సృష్టించిన ఘటన బూర్గంపాడు మండలం సారపాకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భాస్కర్ నగర్‌కు చెందిన భూక్య శ్రీరాములు పేరున ఉన్న ఎల్ఐసీ బీమా డబ్బులను కాజేసేందుకు ఏజెంట్ ఏకంగా డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. ఆ సర్టిఫికెట్ ద్వారా పది లక్షల భీమా సొమ్ము పొంది బాధితుడికి 3.5 లక్షలు ఇచ్చి మిగతావి ఏజెంట్ కాజేశాడు. విషయం బయటికి రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.
Similar News
News February 7, 2025
వివేకా కేసులో జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?: దస్తగిరి
AP: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని కడపలో విచారణ అధికారి 3గంటల పాటు ప్రశ్నించారు. గతేడాది జైలులో తనను ఇబ్బందులు పెట్టారని ఆయన ఇటీవల ఫిర్యాదు చేయగా విచారణకు పిలిచారు. దస్తగిరి మాట్లాడుతూ.. ‘వివేకా హత్య కేసులో జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. ఈ కేసులో త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. ప్రభుత్వానికి ఈ కేసు సవాల్ లాంటిది’ అని అన్నారు.
News February 7, 2025
ఆసిఫాబాద్: ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
జిల్లా ప్రధాన ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందుల పంపిణీ పై సమాచారం తీసుకున్న తర్వాత ఆస్పత్రిలో ప్రసవాల గురించి ఆరా తీశారు.
News February 7, 2025
ఆసిఫాబాద్: రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్
ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే కోరారు. శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు.