News February 7, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే పత్తి ధర ఈరోజు రూ.10 పెరిగింది. గురువారం రూ.6,970 పలికిన పత్తి ధర.. నేడు రూ.6,980 చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ వారం మొదటి నుంచి క్రమంగా పత్తి ధరలు చూస్తే.. సోమవారం రూ.7 వేలు మంగళవారం రూ.6,960, బుధవారం రూ.6,980, గురువారం రూ.6,970 పలికాయి.

Similar News

News February 7, 2025

జగిత్యాల: క్వింటాల్ నువ్వుల ధర రూ. 10,000

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు వివిధ దినుసులకు పలికిన ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ. 5,455, గరిష్ఠ ధర రూ. 6,401గా నమోదయ్యాయి. అనుములు కనిష్ఠ ధర రూ. 3,159, గరిష్ఠ ధర రూ. 7,685గా ఉన్నాయి. మక్కల ధర రూ. 2,281గా ఉంది. అటు నువ్వులు క్వింటాల్ ధర రూ. 10 వేలు పలికింది. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ వివరాలు వెల్లడించారు.

News February 7, 2025

ఇన్ఫో‌సిస్‌లో మరోసారి లేఆఫ్స్?

image

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫో‌సిస్‌ మరోసారి లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. మైసూర్ క్యాంపస్‌లో దాదాపు 700 మంది ట్రైనీ ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో భాగంగా నిర్వహించిన ఎవాల్యుయేషన్ పరీక్షల్లో వీరందరూ ఫెయిల్ కావడంతోనే ఇంటికి పంపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తమను ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతోనే పరీక్షలు కఠినంగా నిర్వహించారని ఉద్యోగులు వాపోతున్నారు.

News February 7, 2025

జనగామ: 30 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్

image

జనగామ జిల్లా కలెక్టరేట్లోని సమాచార పౌరసంబంధాల శాఖ, విద్యా శాఖ, ఉద్యానవన శాఖ, పంచాయతీ శాఖతో పాటు పలు కార్యాలయాలను కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మూమెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. సమయానుగుణంగా కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. సమయపాలన పాటించని 30 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధులకు హాజరుకాని వారి వివరాలపై ఆరా తీశారు.

error: Content is protected !!