News February 7, 2025

KMR: ఈనెల 10న జిల్లా స్థాయి ట్రయథ్లాన్ సెలక్షన్స్

image

కామారెడ్డి జిల్లా స్థాయి యూత్ ట్రయథ్లాన్ సెలక్షన్స్ ఈనెల 10న నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జైపాల్ రెడ్డి, అనిల్ కుమార్ శుక్రవారం తెలిపారు. అండర్ 20, 18, 16, 14 విభాగాల్లో.. వివిధ అంశాల్లో ఈ ఎంపికలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్‌తో జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఉదయం 8 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు.

Similar News

News March 10, 2026

సిరిసిల్ల: జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక

image

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన క్రీడాకారిణి ఎంపికైంది. గ్రామానికి చెందిన గుంటుక లయ హైదరాబాద్‌లోని డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. ఇటీవల ఓయూలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీల్లో లయ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యింది. ఓయూ ఉమెన్స్ టీం తరఫున పోటీల్లో పాల్గొననుంది.

News March 10, 2026

ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయింది: ట్రంప్

image

ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయిందని US ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగిసేందుకు 4-5 వారాల సమయం పడుతుందని అంచనా వేయగా, అంతకంటే ముందే పూర్తి కాబోతున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్‌కు ఇప్పుడు నేవీ, కమ్యూనికేషన్స్, ఎయిర్ ఫోర్స్ ఏవీ లేవని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలపై ట్రంప్ ఫోన్‌ కాల్‌లో చర్చించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది.

News March 10, 2026

కడప: MSPతో 10,059 క్వింటాళ్లు కొనుగోలు

image

కడప జిల్లాలో సోమవారం నాటికి రైతుల నుంచి కనీస మద్దతు ధర(MSP)తో 10,059 క్వింటాళ్ల పంటను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. సుమారు 2,021 మంది రైతుల నుంచి 8,210 క్వింటాళ్ల శనగలు, 50 మంది రైతుల నుంచి 1,819 క్వింటాళ్ల కందులు, 1 రైతు నుంచి 30 క్వింటాళ్ల పెసలు కొనుగోలు చేశారు. జిల్లాలో 21 ప్రొక్యూర్ మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హ్యాండ్లింగ్, క్లీనింగ్ పేరుతో క్వింటాలుకు రూ.200లు రాబడుతున్నారు.