News February 7, 2025

స్థానిక ఎన్నికలు: భూపాలపల్లి జిల్లా పూర్తి వివరాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన భూపాలపల్లి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 2, ఒక రెవెన్యూ డివిజన్ ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-12, MPP-12, MPTC-106, గ్రామ పంచాయతీలు-242, వార్డులు 2044 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో‌ గ్రామాల్లో సందడి నెలకొంది.

Similar News

News October 19, 2025

వెలుగులను నింపేది దీపావళి: జనగామ కలెక్టర్

image

చీకట్లను తొలగించి వెలుగును అందించే పండగ దీపావళి అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులను నింపే దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులందరితో కలిసి జిల్లా ప్రజలందరూ సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.

News October 19, 2025

పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి: ఎస్పీ

image

అనంతపురం జిల్లా ప్రజలకు, జిల్లా పోలీసు సిబ్బందికి ఎస్పీ జగదీశ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి మీ జీవితాలలో చీకట్లను పారదోలి మరిన్ని కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ దీపావళి పర్వదినాన ఆనవాయితీగా వచ్చే బాణసంచాను సరైన జాగ్రత్తలతో కాల్చాలని సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News October 19, 2025

దీపారాధన సమయంలో చదవాల్సిన మంత్రం

image

దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ॥
దీపం జ్యోతి సాక్షాత్తూ దైవస్వరూపం. ఇది అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, జ్ఞానమనే వెలుగును ఇస్తుంది. దీపం వల్లే మన కార్యాలన్నీ సుగమం అవుతాయి. అందుకే దీపాన్ని దీపలక్ష్మిగా పూజిస్తూ ‘సంధ్యా దీపమా! నీకు నమస్కారం’ అని అంటాం. ఎవరి ఇంట అయితే దీపాలెప్పుడూ వెలుగుతూ ఉంటాయో.. వారే నిజమైన ఐశ్వర్యవంతులని పెద్దలు చెబుతారు.