News February 7, 2025

మర్కోడు ఎంపీపీఎస్ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు మండల పరిషత్ పాఠశాలలో శుక్రవారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉదయం పాఠశాలకి వచ్చేసరికి క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయి. పాఠశాలలో పూజలు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాంటి వారిని కనిపెట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News March 16, 2026

‘మౌంటెడ్ స్ప్రేయర్’తో ఎరువుల పిచికారీ సులభం

image

అందుబాటులోకి వస్తున్న ఆధునిక పరికరాలు సాగులో రైతు శ్రమను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది రైతులు ‘మౌంటెడ్ స్ప్రేయర్’ అనే పరికరాన్ని వాడుతున్నారు. దీన్ని ట్రాక్టరుకు బిగించి ద్రవరూపంలో ఎరువులను పిచికారీ చేస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రోజుకు 20 ఎకరాల వరకు స్ప్రే చేయవచ్చు. దీన్ని వాడటం వల్ల కూలీల కొరతను అధిగమించడంతో పాటు మొక్కలకు కూడా సమపాళ్లలో ఎరువులు, మందులను అందించవచ్చు.

News March 16, 2026

అంగన్వాడీలకు శుభవార్త

image

APలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేయనున్నట్లు కేంద్ర సంస్థ EESL వెల్లడించింది. తొలి దశలో 11,400 పంపిణీ చేశామని, మరో 44,346 కేంద్రాలకూ త్వరలోనే అందిస్తామని తెలిపింది. దీనివల్ల LPG వినియోగం తగ్గి ఏటా రూ.24 కోట్ల వరకు ఆదా అవుతుందని, 28వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని పేర్కొంది. అగ్నిప్రమాదాలు ఉండవని, సిబ్బంది సురక్షితంగా వంట చేసుకోవచ్చని వివరించింది.

News March 16, 2026

ఆస్కార్‌ అవార్డు‌ను అమ్ముకోవచ్చా.. దాని విలువెంత?

image

ఆస్కార్ అవార్డు గ్రహీతలకు ట్రోఫీ తప్ప ప్రత్యేకంగా నగదు బహుమతి అంటూ ఏమీ ఇవ్వరు. ఒక్కో ట్రోఫీ తయారీకి 400 డాలర్లు ఖర్చు అవుతుంది. అయితే విజేతలు తమకు వచ్చిన బహుమతిని విక్రయించేందుకు వీలులేదు. అకాడమీకి 1 డాలర్‌‌కు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. 1951లో ఈ రూల్ తెచ్చారు. 1950కి ముందు ఇచ్చిన అవార్డులకు ఇది వర్తించదు. ఓ ఆస్కార్ అవార్డు అధికారిక విలువ $1 అయినా.. అది తెచ్చిపెట్టే ప్రతిష్ఠ ఎనలేనిది. ఏమంటారు?