News February 7, 2025
స్థానిక ఎన్నికలు: జనగామ జిల్లా పూర్తి వివరాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన జనగామ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 3, మున్సిపాలిటీలు 2 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-12, MPP-12, MPTC-193, గ్రామ పంచాయతీలు-280, వార్డులు 2534 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
Similar News
News March 12, 2026
ప్రగతి ప్రణాళికను జయప్రదం చేయాలి:ఎమ్మెల్సీ

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ కోరారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో గురువారం మున్సిపల్ ఛైర్మన్లు, ఉప ఛైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రణాళిక అమలుపై వివరాలు తెలియజేశారు.
News March 12, 2026
చింతపల్లి: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

చింతపల్లి మండలం అంతర్ల జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. జీకే మండలం దొడ్డికొండ గ్రామానికి చెందిన యువకుడు, చింతపల్లి మండలం గంజిగడ్డ గ్రామానికి చెందిన మరో యువకుడు కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతూ లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడిని చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 12, 2026
జగన్ విమర్శలు దొంగే దొంగ అన్నట్లున్నాయి: ఆది కృష్ణమ్మ

కూటమి ప్రభుత్వంపై YCP అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలు దొంగే దొంగ దొంగ అన్నట్లున్నాయనిని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ విమర్శించారు. కర్నూలులో ఆమె మాట్లాడారు. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను కూడా తీసుకు రాలేదని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు.


