News February 7, 2025

గద్వాల: ట్రాన్స్ జెండర్‌‌తో ప్రేమ.. యువకుడి సూసైడ్..?

image

పురుగు మందు తాగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చింతలపేటకు చెందిన నవీన్ అదే కాలనీకి చెందిన ట్రాన్స్ జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం తన తండ్రి సమాధి వద్ద పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి ప్రైవేట్ పార్ట్స్ వద్ద గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 28, 2026

నల్గొండ: ఈ ఒక్క రోజే అవకాశం!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్నీ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ కేసులను ఇరువర్గాల అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగే శ్రమను, ఖర్చులు తగ్గించుకోవాలని కోరారు.

News March 28, 2026

WGL: సాదాబైనామాలకు ప్రగతి మోక్షం లభించేనా?

image

‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలోనైనా తమ సాదాబైనామాలకు మోక్షం కలుగుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అఫిడవిట్ నిబంధన తొలగించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,71,790 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. WGLలో 53,996, HNK 30,371, MHBD 68,482, MLG 34,441, జనగామ 32,600, భూపాలపల్లిలో 51,900 దరఖాస్తులు వచ్చాయి.