News February 7, 2025

తల్లి మందలించిందని యువతి సూసైడ్

image

తల్లి మందలించిందని యువతి సూసైడ్ చేసుకున్న ఘటన అశ్వారావుపేట మండలంలో జరిగింది.  ఏఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. తిరుమలకుంటకు చెందిన ఓ యువతి (19) పనులు చేయడం లేదని తల్లి మందలించింది. మనస్తాపం చెంది యువతి జనవరి 15న పురుగు మందు తాగింది. ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. 

Similar News

News March 18, 2026

తిరుపతి: టెన్త్ పరీక్షలకు 213 మంది గైర్హాజరు

image

తిరుపతి జిల్లాలో మంగళవారం 10వ తరగతి హిందీ పరీక్ష జరిగింది. జిల్లాలో 26,683 మంది విద్యార్థులకు గాను 26,470 మంది హాజరయ్యారు. 213 మంది గైర్హాజరైనట్లుDEO కేవీఎన్ కుమార్ చెప్పారు. ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి 892 మందికి గాను 786 హాజరయ్యారు. 106 మంది పరీక్షలకు రాలేదు.

News March 18, 2026

ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి హిందీ పరీక్ష

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా పదో తరగతి హిందీ పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 16,990 మంది విద్యార్థులకు గానూ 16,972 మంది హాజరయ్యారని, 99.89 శాతం హాజరు నమోదైనట్లు డీఈవో చైతన్య జైనీ తెలిపారు. పరీక్షా కేంద్రాలను డీఈవోతో పాటు ఏసీజీఈ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ముమ్మరంగా తనిఖీ చేశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

News March 18, 2026

IPL: ఈసారి ‘క్యాప్’ పెట్టుకునేదెవరో?

image

సీజన్‌లో అత్యధిక రన్స్, వికెట్లు తీసిన ప్లేయర్లకు ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు ఇస్తారు. గత 5 సీజన్లలో ఒక్కసారి(బ్యాటింగ్ విభాగంలో) మినహా అన్నీ ఇండియన్సే దక్కించుకున్నారు. 2021లో రుతురాజ్(635 రన్స్), హర్షల్ పటేల్(32 వికెట్లు), 2022లో బట్లర్(863), చాహల్(27), 2023లో గిల్(890), షమీ(28), 2024లో కోహ్లీ(741), హర్షల్(24), 2025లో సుదర్శన్(759), ప్రసిద్ధ్(25) గెలిచారు. ఈ సారి ఎవరిని వరిస్తాయనుకుంటున్నారు?