News February 7, 2025
NZB: మృత్యువులోనూ వీడని స్నేహం

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద నిన్న ఎదురెదురుగా ఆటో, లారీ ఢీకొని మాక్లూర్‌కు చెందిన <<15383679>>ఇద్దరు మృతిచెందిన<<>> సంగతి తెలిసిందే. ఈప్రమాదంలో మృతిచెందిన ఇంతియాజ్, వెల్డింగ్ పని చేసే ఫర్హాన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు అని మృతుల బంధువులు తెలిపారు. కాగా ఫర్హాన్‌కు వివాహమవగా 3నెలల పాప కూడా ఉందన్నారు.మృత్యువులోనూ వారి స్నేహం వీడలేదని కన్నీటి పర్యంతమయ్యారు.గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 16, 2026
దుబ్బాక ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

దుబ్బాక ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామానికి చెందిన రత్నాగారి లత కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు. సర్జన్ డాక్టర్ హేమరాజ్ సింగ్ నేతృత్వంలో సుమారు 7.1 కిలోల బరువున్న మల్టీపుల్ ఫైబ్రాయిడ్ గడ్డలను శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు వైద్యులు తెలిపారు.
News March 16, 2026
ఆస్తి పన్ను బకాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా?

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వన్ టైమ్ స్కీమ్’ (OTS) ద్వారా బకాయిలపై 90% వడ్డీ మాఫీని పొందే సువర్ణ అవకాశం ఇది. ఇప్పటివరకు GHMC, CMC, MMC పరిధిలో 2.67 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకుని, రూ. 52.08 కోట్ల వడ్డీని ఆదా చేసుకున్నారు. ఇప్పటికే 1.64 లక్షల నోటీసులు జారీ అయ్యాయి. జప్తు వారెంట్ల వంటి కఠిన చర్యలకు గురికాకుండా, వెంటనే మీ పన్ను బకాయిలను చెల్లించి భారీగా ఆదా చేసుకోండి!