News February 7, 2025

ఆ కామెంట్స్ నేను పట్టించుకోను: హర్షిత్ రాణా

image

ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణాను దించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దానిపై రాణా స్పందించారు. ‘అనేవాళ్లు అంటూనే ఉంటారు. అవేవీ నేను పట్టించుకోదలచుకోలేదు. నా ఆటపైనే తప్ప వేరే వాటిపై దృష్టి పెట్టను’ అన్నారు. గ్రౌండ్‌కి వచ్చిన తర్వాతే తాను అరంగేట్రం చేస్తున్నట్లు తెలిసిందని.. దానికి ముందుగానే సిద్ధమై ఉన్నానని తెలిపారు.

Similar News

News February 7, 2025

ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ఖరారు

image

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు పీఎంవో తెలిపింది. ఈ నెల 10, 11 తేదీల్లో ఫ్రాన్స్‌లో ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ఏఐ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. అలాగే అక్కడ ఉన్న థర్మో న్యూక్లియర్ రియాక్టర్‌ను సందర్శించనున్నారు. అనంతరం 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధాని పర్యటించనున్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన US వెళ్లనున్నారు.

News February 7, 2025

ఇక‌పై ఫోన్‌లోనే అన్ని ధ్రువపత్రాలు: భాస్కర్

image

AP: రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్‌పై IT శాఖ కార్యదర్శి భాస్కర్ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘ఇకపై అన్ని ధ్రువపత్రాలు ఫోన్‌లోనే జారీ చేస్తాం. ప్రతి పౌరుడికి DG లాకర్ సదుపాయం కల్పిస్తాం. అన్ని పత్రాలూ వాట్సాప్‌లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారానే అర్జీలు, ఫిర్యాదులు చేయొచ్చు. చదువురాని వాళ్లు వాయిస్ ద్వారా సంప్రదించవచ్చు. ప్రతిశాఖలో చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమిస్తాం’ అని అన్నారు.

News February 7, 2025

ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్‌కు అలవాటే: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘కుల గణనతో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ఏ చట్టంలో ఉంది. ముస్లింలను కూడా కలిపి బీసీలకు అన్యాయం చేశారు. కుల గణన జరిపిన విధానమే సరిగ్గా లేదు. ఈ సర్వేపై బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కులాలు, మతాల పేరిట ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్‌కు అలవాటే’ అని విమర్శించారు.

error: Content is protected !!