News February 7, 2025

గద్వాల: ట్రాన్స్ జెండర్‌‌తో ప్రేమ.. యువకుడి సూసైడ్..?

image

పురుగు మందు తాగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చింతలపేటకు చెందిన నవీన్ అదే కాలనీకి చెందిన ట్రాన్స్ జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం తన తండ్రి సమాధి వద్ద పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి ప్రైవేట్ పార్ట్స్ వద్ద గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 19, 2026

ఉగాది స్పెషల్.. ఉమ్మడి జిల్లాలో గోవులకు పూజలు..!

image

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల్లో గోమాతలకు పూజలు నిర్వహించారు. పర్వతగిరి మండలం చింతనెక్కొండలో ఆవులు, దూడలకు పూజలు చేసి పిండి పదార్థాలను తినిపించారు. గ్రామస్థుల ఇండ్లలో ఉండే వాహనాలు, వ్యవసాయానికి వినియోగించే యంత్ర పరికరాలకు సైతం అందంగా ముస్తాబు చేసి పూజలు చేశారు. పాడిపంటలు చల్లగా ఉండాలని పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు.

News March 19, 2026

జనగామ: మంజూరైనవి 5,647.. పూర్తయినవి 241..!

image

జనగామ జిల్లాలో రెండో విడతలో 5,647 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 241 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, స్లాబ్ దశలో 2,920, పునాది దశలో 1128, మార్కింగ్ చేసినా పునాది పనులు కానివి 450 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా 908 ఇండ్లకు సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. పనులు నెమ్మదించిన ఇళ్లపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు.

News March 19, 2026

సౌదీ అరామ్‌కో రిఫైనరీపై ఇరాన్ దాడి

image

ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి, ఎగుమతిదారు అయిన సౌదీకి చెందిన అరామ్‌కో రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. నష్ట తీవ్రతపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని తెలిపారు. ‘సౌత్ పార్స్’పై అటాక్‌కు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ వరుస <<19422796>>దాడులు<<>> చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.