News February 7, 2025
గద్వాల: ట్రాన్స్ జెండర్‌తో ప్రేమ.. యువకుడి సూసైడ్..?

పురుగు మందు తాగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చింతలపేటకు చెందిన నవీన్ అదే కాలనీకి చెందిన ట్రాన్స్ జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం తన తండ్రి సమాధి వద్ద పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి ప్రైవేట్ పార్ట్స్ వద్ద గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 24, 2026
రూ.10వేలు తగ్గిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర క్రమంగా తగ్గుతోంది. ఇవాళ కేజీ సిల్వర్ రేటు రూ.10,000 పతనమై రూ.2,40,000కు చేరింది. శుభకార్యాల వేళ వారం రోజుల్లోనే కేజీ సిల్వర్ రేటు రూ.40,000 తగ్గి కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పతనమవుతున్న ఈ ధరలు ఇన్వెస్టర్లకు నష్టాలనిస్తున్నాయి.
News March 24, 2026
HNK: క్షయ పరీక్ష కేంద్రాల్లో వైద్య సేవలు

జిల్లాలో మొత్తం 4 ప్రభుత్వ వైద్య పరీక్షా కేంద్రాలు (CBNAAT/TRUNAAT) అందుబాటులో ఉన్నాయని హనుమకొండ జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కె.హిమబిందు తెలిపారు. కేయూ సమీపంలో టీబీ ఆసుపత్రి, కాకతీయ మెడికల్ కాలేజీ, టీబీ హాస్పిటల్ పరకాల, ముల్కనూరులో ఉచిత క్షయ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.
# నేడు ప్రపంచ క్షయ దినోత్సవం.
News March 24, 2026
అనంత ఆశాకిరణం!

1969లో విన్సెంట్ ఫెర్రర్ స్థాపించిన <<19461854>>ఆర్టీటీ<<>> (RDT) సంస్థ, గత 56 ఏళ్లుగా అనంతపురం జిల్లాలో పేదల పాలిట కొంగుబంగారంగా నిలుస్తోంది. కరవు సీమలో పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందించడం, పేద పిల్లలను చదివించడం, మహిళలు సొంతంగా ఎదిగేలా చేయడంలో ఈ సంస్థ పాత్ర మరువలేనిది. కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి అండగా నిలుస్తున్న ఆర్టీటీ, అనంతపురం ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయింది.


