News February 7, 2025
విజయవాడలో భారీ దొంగతనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738910281085_51960253-normal-WIFI.webp)
విజయవాడ శివారు ఎనికేపాడులో భారీ దొంగతనం జరిగింది. పటమట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎనికేపాడులోని ఐఫోన్ గోడౌన్ రేకు పగలకొట్టి గుర్తుతెలియని దుండగులు రూ.2.50కోట్ల విలువైన 372 ఐఫోన్లు చోరీ చేసినట్లు గుర్తించారు. మేనేజర్ ఫరూక్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు.
Similar News
News February 7, 2025
పోస్టులు తానే పెట్టినట్లు ఒప్పుకొన్న ఆర్జీవీ?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1738215793336_893-normal-WIFI.webp)
AP: సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోల పోస్టుల కేసుపై ఒంగోలులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో RGV కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ‘చంద్రబాబు, పవన్, లోకేశ్ ఫొటోలను మార్ఫ్ చేసి నేనే నా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశా. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగానే పోస్టులు చేశా. ఈ విషయంలో YCP నేతలకు సంబంధం లేదు. వారితో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి’ అని చెప్పినట్లు సమాచారం.
News February 7, 2025
సిద్దిపేట: నులి పురుగుల దినోత్సవం విజయవంతం చేయాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738927548862_60378208-normal-WIFI.webp)
1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వేయించి జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ మనుచౌదరి సూచించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ హల్‌లో ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ వారు జారీ చేసిన జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ అవగాహన పోస్టర్ పోస్టర్‌ని ఆవిష్కరించారు.
News February 7, 2025
CSR సమ్మిట్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738925598289_50024734-normal-WIFI.webp)
ఈనెల 16న శిల్పకళావేదికలో జరిగే సౌత్ ఇండియా CSR సమ్మిట్ పోస్టర్ను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. సమ్మిట్‌లో వెయ్యి కార్పొరేట్ సంస్థలు, 2వేల మంది NGO’S, పబ్లిక్ ఎంటర్ ప్రైజేస్‌ల ప్రతినిదులు పాల్గొంటారని తెలిపారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి 50 కేటగిరిల్లో సేవా అవార్డులు ఇవ్వనున్నారు. సమ్మిట్ లైసెన్సీ వినీల్ రెడ్డి, TDF ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.