News February 7, 2025

వైభవంగా మహా కుంభాభిషేకం ప్రారంభం

image

కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. వేద పండితులు అచలాపురం రిత్వికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత అరుదైన ఘట్టానికి శ్రీకారం జరిగింది. కుంభాభిషేక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని, ముందుకు సాగే విధంగా కార్యాచరణను అధికారులు రూపొందించారు.

Similar News

News February 7, 2025

హీరో నాగార్జునను కలిసిన అనంతపురం ఎంపీ

image

ఢిల్లీలోని పార్లమెంటులో సినీ నటుడు అక్కినేని నాగార్జునను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కలిశారు. ప్రధాని మోదీని కలిసేందుకు పార్లమెంటుకు వచ్చిన ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాగార్జున ప్రధానిని కలిశారు. అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

News February 7, 2025

విజన్-2047కు సహకరించండి: చంద్రబాబు

image

AP: స్వర్ణాంధ్ర విజన్ 2047కు సహకరించాలని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీని CM చంద్రబాబు కోరారు. అమరావతిలో ఆయనతో CM భేటీ అయ్యారు. ‘రాష్ట్రంలో ఏటా 15 శాతం వృద్ధి సాధించి 2047కల్లా 42 వేల డాలర్ల తలసరి ఆదాయానికి అందరూ చేరుకునేలా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో అత్యుత్తమ పాలసీలు అమలు చేస్తున్నాం. నీతి ఆయోగ్ మద్దతు ఉంటే ఇంకాస్త ముందుకెళ్తాం. 2047కల్లా APని మోడల్ స్టేట్‌గా మార్చవచ్చు’ అని పేర్కొన్నారు.

News February 7, 2025

నార్సింగిలో బాలికపై సామూహిక అత్యాచారం

image

రాజేంద్రనగర్‌లోని నార్సింగి PS పరిధి దారుణం జరిగింది. హైదర్ షో కోట్‌లో 4 రోజుల క్రితం బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని బాధితులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

error: Content is protected !!