News February 7, 2025
వైభవంగా మహా కుంభాభిషేకం ప్రారంభం

కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. వేద పండితులు అచలాపురం రిత్వికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత అరుదైన ఘట్టానికి శ్రీకారం జరిగింది. కుంభాభిషేక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని, ముందుకు సాగే విధంగా కార్యాచరణను అధికారులు రూపొందించారు.
Similar News
News April 1, 2026
కడప: AMCల టార్గెట్ 14.27 కోట్లు.. వసూలు ఎంతంటే.!

కడప జిల్లాలో 11 AMCలు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జిల్లా టార్గెట్ రూ.14.27 కోట్లు కాగా.. మార్కెట్ సెస్ రూపంలో రూ.13.37 కోట్లు ఆదాయం సాధించాయి.
AMCల వారీగా ఆదాయం వివరాలు (కోట్లలో).
కడప-2.21, ప్రొద్దుటూరు-1.61, బద్వేల్-2.21.
జమ్మలమడుగు-0.95, పులివెందుల-1.15, రాజంపేట-0.59.
మైదుకూరు-2.33, కమలాపురం-1.00, సిద్ధవటం-0.28.
ఎర్రగుంట్ల-0.75, సింహాద్రిపురం-0.25 కోట్లు ఆదాయం లభించింది.
News April 1, 2026
మెదక్: గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈనెల 2న గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు ఆదేశించారు. గ్రామ, మున్సిపల్ వార్డు సభలు, సభల నిర్వహణపై బుధవారం మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ ద్వారా సూచనలు ఇచ్చారు. గ్రామ సభలు, మున్సిపల్ సభలు పండగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
News April 1, 2026
యంగ్ హీరోలతో బాలయ్య పోటీ.. మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్!

బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో మూవీ చేస్తుండగా, ఆ తర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దసరాకు షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే విజయ్ కనకమేడల చెప్పిన కథకూ బాలయ్య ఓకే చెప్పినట్లు సమాచారం. ఇది 2027 ఆరంభంలో పట్టాలెక్కనుందని టాక్. నాంది, భైరవం, ఉగ్రం చిత్రాలకు విజయ్ డైరెక్షన్ చేశారు.


