News February 7, 2025
వైభవంగా మహా కుంభాభిషేకం ప్రారంభం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738911213694_717-normal-WIFI.webp)
కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. వేద పండితులు అచలాపురం రిత్వికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత అరుదైన ఘట్టానికి శ్రీకారం జరిగింది. కుంభాభిషేక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని, ముందుకు సాగే విధంగా కార్యాచరణను అధికారులు రూపొందించారు.
Similar News
News February 7, 2025
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738930292999_51991011-normal-WIFI.webp)
జిల్లాలో ఇసుక తవ్వకాలు, స్టాక్ పాయింట్ల ద్వారా సరఫరా ప్రక్రియలు సజావుగా జరిగేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. శుక్రవారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పర్యావరణ, ఇతర అనుమతుల ఆధారంగా తవ్వకాలు జరిగేలా, సరఫరాలో ఆటంకం లేకుండా చూడాలన్నారు.
News February 7, 2025
10న శ్రీశైలానికి మంత్రులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738931727918_60465469-normal-WIFI.webp)
శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 23న సీఎం చంద్రబాబు శ్రీశైలానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న పలువురు మంత్రులు క్షేత్రానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, అనిత, అనగాని సత్యప్రసాద్, అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా ఏర్పాట్లు పరిశీలిస్తారు.
News February 7, 2025
ఈనెల 12న విజయ్ దేవరకొండ కొత్త సినిమా టీజర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738931816521_746-normal-WIFI.webp)
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘VD12’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర టైటిల్‌తో పాటు టీజర్ వీడియోను ఈనెల 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, ఈ మూవీ టైటిల్‌ను ‘సామ్రాజ్యం’గా ఫిక్స్ చేసినట్లు సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది.