News February 7, 2025
ఆపరేషన్ టైగర్: శిండే గూటికి ఠాక్రే ఎంపీలు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738908440273_1199-normal-WIFI.webp)
మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ హాట్‌టాపిక్‌గా మారింది. ఉద్ధవ్ ఠాక్రే SSUBT 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిండే శివసేనలో చేరబోతున్నారని సమాచారం. ఇప్పటికే చర్చలు ముగిశాయని, వచ్చే పార్లమెంటు సెషన్‌లోపు వీరు చేరడం ఖాయమేనని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో NDA అధికారంలో ఉండటం, ఐదేళ్ల వరకు నిధులు లేకుండా మనుగడ కష్టమవ్వడమే ఇందుకు కారణాలని టాక్. 2/3 వంతు MP/MLAలు మారితే పార్టీ మార్పు నిరోధక చట్టం వర్తించదు.
Similar News
News February 7, 2025
విజన్-2047కు సహకరించండి: చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738927390290_1032-normal-WIFI.webp)
AP: స్వర్ణాంధ్ర విజన్ 2047కు సహకరించాలని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీని CM చంద్రబాబు కోరారు. అమరావతిలో ఆయనతో CM భేటీ అయ్యారు. ‘రాష్ట్రంలో ఏటా 15 శాతం వృద్ధి సాధించి 2047కల్లా 42 వేల డాలర్ల తలసరి ఆదాయానికి అందరూ చేరుకునేలా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో అత్యుత్తమ పాలసీలు అమలు చేస్తున్నాం. నీతి ఆయోగ్ మద్దతు ఉంటే ఇంకాస్త ముందుకెళ్తాం. 2047కల్లా APని మోడల్ స్టేట్‌గా మార్చవచ్చు’ అని పేర్కొన్నారు.
News February 7, 2025
RTC జేఏసీని చర్చలకు పిలిచిన కార్మిక శాఖ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738925661991_782-normal-WIFI.webp)
TGSRTC జేఏసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా ఈ నెల 10న చర్చల్లో పాల్గొనాలని పిలిచింది. జనవరి 27న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2,700 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో జేఏసీ డిమాండ్ చేసింది.
News February 7, 2025
ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ లేదు: సీఎం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738927442507_81-normal-WIFI.webp)
TG: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని CM రేవంత్ వెల్లడించారు. ‘క్యాబినెట్‌లో ఎవరుండాలనే దానిపై అధిష్ఠానానిదే నిర్ణయం. నేను ఎవరి పేరు ప్రతిపాదించలేదు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం వెళ్తాం. త్వరగా అరెస్ట్ చేయించి జైలుకు పంపే ఆలోచన లేదు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే లక్ష్యం. పనిచేసుకుంటూ పోవడమే తెలుసు. వ్యక్తిగత నిర్ణయాలు ఎన్నడూ ఉండవు’ అని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు.