News February 7, 2025

కరీంనగర్: ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వి.నరేందర్ రెడ్డి

image

ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్,మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వి.నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.

Similar News

News February 7, 2025

అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో నిఘా పెంచాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక త‌వ్వ‌కాలు, స్టాక్ పాయింట్ల ద్వారా స‌ర‌ఫ‌రా ప్ర‌క్రియ‌లు స‌జావుగా జ‌రిగేలా వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో పనిచేయాల‌ని అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో నిఘా పెంచాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. శుక్ర‌వారం జిల్లాస్థాయి ఇసుక క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప‌ర్యావ‌ర‌ణ‌, ఇత‌ర అనుమ‌తుల ఆధారంగా త‌వ్వ‌కాలు జ‌రిగేలా, స‌ర‌ఫ‌రాలో ఆటంకం లేకుండా చూడాలన్నారు.

News February 7, 2025

10న శ్రీశైలానికి మంత్రులు

image

శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 23న సీఎం చంద్రబాబు శ్రీశైలానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న పలువురు మంత్రులు క్షేత్రానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, అనిత, అనగాని సత్యప్రసాద్, అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా ఏర్పాట్లు పరిశీలిస్తారు.

News February 7, 2025

ఈనెల 12న విజయ్ దేవరకొండ కొత్త సినిమా టీజర్

image

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘VD12’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర టైటిల్‌తో పాటు టీజర్ వీడియోను ఈనెల 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, ఈ మూవీ టైటిల్‌ను ‘సామ్రాజ్యం’గా ఫిక్స్ చేసినట్లు సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది.

error: Content is protected !!