News February 7, 2025

AI సమ్మిట్: వచ్చేవారం ఫ్రాన్స్‌కు మోదీ

image

ప్రధాని నరేంద్రమోదీ వచ్చేవారం ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. FEB 11న పారిస్‌లో జరిగే AI సమ్మిట్‌కు ఆ దేశ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి కో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిసింది. దీనికి US VP JD వాన్స్, చైనా DyPM లీ కియాంగ్ హాజరవుతారు. 12న ఎయిరోస్పేస్, ఇంజిన్స్, సబ్‌మెరైన్ సహా ఇతర రంగాల్లో ఒప్పందాల పురోగతిపై మేక్రాన్, మోదీ చర్చిస్తారు. ఫ్రెంచ్ కంపెనీల అధిపతులు, దౌత్యవేత్తలతో సమావేశమవుతారు.

Similar News

News February 7, 2025

గ్రేట్.. ఆరు నెలల బోనస్ ఇచ్చిన స్టార్టప్

image

ఉద్యోగుల విధేయతను గౌరవిస్తూ ఓ కంపెనీ వారికి 6 నెలల జీతాన్ని బోనస్‌గా ఇచ్చింది. TNలోని కోయంబత్తూరులో ఉన్న AI స్టార్టప్ ‘KOVAI.CO’ను శరవణ కుమార్ స్థాపించారు. మొత్తం 140 మంది ఉద్యోగులుండగా, వారికి రూ.14 కోట్లు బోనస్‌గా ఇచ్చారు. ‘స్టార్టప్‌లలో పనిచేసేందుకు ఎవరూ మొగ్గుచూపారు. మూడేళ్లు మాతో పనిచేస్తే 2025 జనవరి జీతంలో ఆరు నెలల బోనస్ ఇస్తానని ప్రకటించి ఆ మాటను నిలబెట్టుకున్నా’ అని శరవణ కుమార్ తెలిపారు.

News February 7, 2025

ఆ రెండ్రోజులు బ్యాంకులు బంద్?

image

మార్చి 24, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు దిగనుండటంతో బ్యాంక్ సేవలకు అంతరాయం కలిగే ఛాన్సుంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలోని 9 యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి 2 రోజుల సెలవులు, కొత్త జాబ్స్, DFS రివ్యూను తొలగించడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, రూ.25 లక్షల గ్రాట్యుటీ వరకు IT మినహాయింపు డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు.

News February 7, 2025

రేపటి లోగా బుమ్రా ఫిట్‌నెస్‌పై రిపోర్ట్!

image

భారత స్టార్ బౌలర్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొన్న వేళ జాతీయ క్రికెట్ అకాడమీలో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. మరో 24 గంటల్లో ఫిట్‌నెస్‌పై నివేదిక రానుంది. దాని ఆధారంగా ఇంగ్లండ్‌తో మిగతా వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించడంపై BCCI నిర్ణయం తీసుకోనుంది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

error: Content is protected !!