News February 7, 2025
పలు సమస్యలపై పార్లమెంట్‌లో మాట్లాడిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గురువారం పార్లమెంట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో కొన్ని సమస్యలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు వివరించారు. జిల్లాలో గుడివాడలో కేటీఆర్ కళాశాల, గిలకలదిండి, మెడికల్ కళాశాల, బందర్‌లోని చిలకలపూడి, పెడన్ మెయిన్ రోడ్, ఉప్పులూరు, గూడవల్లి, నిడమానూరు, గుడ్లవల్లేరు, రామవరప్పాడు వద్ద ROB, RUBలను నిర్మించి ట్రాఫిక్‌కు చెక్ పెట్టాలని కేంద్రమంత్రిని కోరారు.
Similar News
News September 13, 2025
ఈ నెల 15 నుంచి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ డీ.కే. బాలాజీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పశుసంపదను రక్షించేందుకు ప్రతి రైతు ఈ టీకా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు.
News September 12, 2025
కృష్ణా: వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే కలెక్టర్‌ల కాన్ఫరెన్స్‌కు అవసరమైన నివేదికలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశమై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
News September 11, 2025
కృష్ణా: సబ్ జూనియర్ సెపక్ తక్రా క్రీడాకారుల ఎంపిక

కృష్ణా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సబ్ జూనియర్ బాల, బాలికల జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 13, 14 తేదీలలో అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు నరేష్ పాల్గొన్నారు.