News February 7, 2025
గజ్వేల్‌లో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల విలీనం

మల్లన్న సాగర్ ముంపుకు గురైన 7 గ్రామాలను గజ్వేల్ మున్సిపాలిటీలో విలీనమైనట్లే అని డీపీవో జానకీదేవి తెలిపారు. తొగుట మండలంలోని 5, కొండపాక మండలంలోని 2 గ్రామాలు ముంపునకు గురి కాగా గజ్వేల్ పరిధిలో ఆర్‌అండ్ ఆర్ కాలనీని నిర్మించి 4ఏళ్ల క్రితం నిర్వాసితులను తరలించారు. ఈ 7గ్రామాల పరిధిలో 15 వేల జనాభా ఉండగా, ఏడు వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. తాజాగా గజ్వేల్ గ్రేడ్ మారడంతోపాటు వార్డుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది.
Similar News
News March 12, 2026
ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క: ఎమ్మెల్యే గూడెం

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. బుధవారం కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ కాలనీలో హరీశ్ రావుతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని గూడెం ఆరోపించారు. “ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క” అంటూ రాజకీయంగా దూకుడు పెంచబోతున్నట్లు సంకేతాలిచ్చారు.
News March 12, 2026
రోడ్లు-భవనాల శాఖ పురోగతిపై సీఎం సమీక్ష

తెలంగాణలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా నియంత్రించడంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు రింగు రోడ్లు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి కోమటి రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News March 12, 2026
మహబూబాబాద్ జిల్లాలో 45 పరీక్షా కేంద్రాలు

పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు మహబూబాబాద్ జిల్లాలో అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల కోసం విషయ నిపుణులతో అవగాహన కార్యక్రమం, రివిజన్ తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాలను ఏర్పాటు చేయగా..8157 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 4156 మంది, బాలికలు 4001 మంది ఉన్నారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పరీక్షలు జరగనున్నాయి.


