News February 7, 2025

మంత్రి నిమ్మలకు 22వ ర్యాంకు పట్ల ఆశ్చర్యం!

image

ఫైళ్ల క్లియరెన్స్‌పై CM చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో నిమ్మల రామానాయుడికి 22వ ర్యాంకు లభించడం పట్ల ప.గో జిల్లా వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎప్పుడూ జలవనరుల శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో నిమ్మల చురుకుగా కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రాజెక్టులు, ఎత్తిపోతలు వంటి అంశాల్లో ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనకబడాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.

Similar News

News March 1, 2026

ప.గో: డబ్బులు కొట్టేసేందుకు వచ్చిన ఫోన్ కాల్ ఇది..!

image

సైబర్ క్రైమ్ మోసగాళ్లు రోజుకో పంథా అనుసరిస్తున్నారు. బురిడీ కొట్టించే ప్రయత్నంలో బెడిసి కొట్టిన ఉదంతం ఆకివీడు మండలంలో వెలుగు చూసింది. అజ్జమూరుకి చెందిన రిటైర్డ్ టీచర్‌కు నిన్న ఉదయం గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్‌కి సంబంధించి పత్రాలపై ష్యూరిటీ పెట్టిన సంగతి గుర్తులేదా అంటూ అతడ్ని భయపెట్టారు. ఆయన ధైర్యంగా ఎదుర్కొనే సరికి తోక ముడిచాడు. మళ్ళీ ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు.

News March 1, 2026

భీమవరం: కలెక్టర్ ఇచ్చిన ఫ్రీజర్లు.. 2 రోజులకే ధ్వంసం

image

గత నెలలో భీమవరం ఆస్పత్రిలో ఫ్రీజర్‌ మరమ్మతులకు గురై ఓ మృతదేహాన్ని రాత్రంతా అలాగే ఉంచిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కలెక్టర్ స్పందించి రూ.2,60,000 నిధులతో 2 కొత్త ఫ్రీజర్లను ఆస్పత్రికి అందించారు. అయితే 2 రోజులకే దుండగులు వాటిలోని కాపర్ వైర్లను కట్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలున్నాయి.

News March 1, 2026

నరసాపురం: పెద్ద మనిషిలా వచ్చి.. బాలికపై లైంగిక వేధింపులు

image

నరసాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలిక కుటుంబ వివాదాలను చక్కదిద్దుతామని పెద్ద మనిషిలా వచ్చి, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలికి రావాల్సిన నగదు విషయంలో నిందితుడు కాకిలేటి ఆనంద్ కుమార్ ఆమెను వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తించేవాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ముత్యాలరావు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.