News February 7, 2025

మెదక్: సగం కాలిన తల, అస్థిపంజరం.. దర్యాప్తు ముమ్మరం

image

మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం తిమ్మాయిపల్లి అటవీ ప్రాంతంలో బయటపడ్డ<<15380073>> అస్థిపంజరం<<>> పోలీసులకు సవాల్‌గా మారింది. వ్యక్తిని ఎక్కడో చంపి ఇక్కడ తగలబెట్టినట్లు తెలుస్తోంది. సగం కాలిన తల, అస్థిపంజరం వద్ద జాకీ డ్రాయర్ ఉండటంతో యువకుడని స్పష్టమవుతోంది. సుమారు 20 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన హవేలిఘనపూర్ పోలీసులు.. మృతుడి వివరాలు కోసం వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 6, 2025

తిరుపతిలో 10వ తేదీన ఇంటర్వ్యూలు

image

శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS)లో 10వ తేదీన వివిధ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కార్యాలయం పేర్కొంది. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్టు -04, న్యూక్లియర్ మెడిసిన్ రేడియో ఫార్మసిస్ట్-01 మొత్తం 5 పోస్టులకు అవకాశం ఉంది. అర్హత, ఇతర వివరాలకు https://svimstpt.ap.nic.in/jobs.html వెబ్‌సైట్ చూడొచ్చు.

News December 6, 2025

రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

image

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.

News December 6, 2025

హోంగార్డుల సేవలు ప్రశంసనీయం: ఎస్పీ

image

రాయచోటిలో హోంగార్డుల 63వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా SP ధీరజ్ హోంగార్డుల సేవలను అభినందిస్తూ, పోలీసు వ్యవస్థకు వారు గొప్ప బలం అంటూ ప్రశంసించారు. హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అత్యుత్తమ సేవలు అందించిన సిబ్బందికి బహుమతులు అందజేశారు. అనంతరం SP జెండా ఊపి హోంగార్డుల గౌరవ ర్యాలీని ప్రారంభించారు. పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.