News March 19, 2024

భీమవరంలో రైలు ఢీకొని మహిళ మృతి

image

భీమవరం రైల్వే అవుట్ పోలీసు స్టేషన్ పరిధి లక్ష్మీనారాయణపురం రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు రైల్వే ఎస్సై పీటీవీ రమణ తెలిపారు. సుమారు 45 ఏళ్లు కలిగిన మహిళ.. నీలం రంగు చీర, గులాబీ రంగు జాకెట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 70939 39777 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 4, 2025

ప.గో: న్యూఢిల్లీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష

image

పీఎం లంక వద్ద సముద్రం కోత నిరోధానికి డిలైట్ కంపెనీ ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ లో న్యూఢిల్లీలోని డిలైట్ ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశమై పీఎం లంక ప్రాజెక్టుపై సమీక్షించారు. పీఎం లంక వద్ద సముద్రపు కోత గురికావడంతో దానికి అడ్డుకట్ట వేసే ప్రాజెక్టుకు ఒప్పందం కుదిరిందన్నారు.

News February 4, 2025

ప.గో: తీర ప్రాంత పిల్లలపై శ్రద్ద పెట్టాలి..కలెక్టర్

image

తీర ప్రాంత గ్రామాల పిల్లలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యాశాఖ అధికారులను, ప్రధానోపాధ్యాయులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టర్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరికలు పాఠశాలలు పునర్వ్యవస్థీకరణపై డీఈవో, నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు.

News February 3, 2025

ప.గో. అందుబాటులో ఇసుక: కలెక్టర్

image

జిల్లా ప్రజల అవసరాలకు స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉంచిన ఇసుక నిల్వలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. జిల్లాలో ఇసుక రీచ్‌లు అందుబాటులో లేనందున జిల్లా స్థాయి ఇసుక కమిటీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీపర్రు-2 ఇసుక రీచ్ నుండి ఇసుకను ఆచంట, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, ఉండి నియోజకవర్గ కేంద్రాలకు తరలించి, స్టాక్ పాయింట్లో అమ్మకాలు చేపట్టామన్నారు.